Friday, 12 June 2026 01:51:00 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

తిరుమల అందాలు చూడతరమా

అరకు, ఊటి ని తలపిస్తున్న తిరుమల కొండలు

Date : 18 October 2024 09:16 AM Views : 987

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుమల స్పెషల్ : బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలతో తిరుమల కొండలపై వాతావరణం చల్లగా మారింది , దట్టమైన పొగ మంచుతో పచ్చని కొండలు పాల సముద్రం లా కనువిందు చేస్తున్నాయి. తిరుమల గిరులు ఊటి, కోడైకెనాల్, అరకును తలపిస్తున్నట్లు ఉండడంతో పర్యాటకులు, భక్తుల తాకిడి ఎక్కువ అయింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇలాంటి వాతావరణం ఏర్పడటం సహజం కానీ ఈ సారీ బంగాళాఖతం లొ అల్ప పీడనం కారణం గా కాస్త ముందుగానే వాతావరణం మారింది.

తిరుమల కొండ అనగానే పవిత్రతతో పాటు ప్రకృతి అందాలకు కూడా నిలయమే. చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లు ఓ వైపు.. మంచు శేషాచల పర్వతాన్ని ముద్దాడుతుంటే….మరో వైపు అదే జలపాతం నుంచి జల ధారలు కురుస్తుండడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.వర్షం వస్తుందంటే చాలు తిరుపతి ప్రజలకు తిరుమలకు వచ్చేటువంటి భక్తులు తమ సెల్ ఫోన్లలో అందాలను ఫోటోలతో సెల్ఫీలతో తమ ఫోన్లో బంధించేస్తారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తిరుపతిలోని కపిల తీర్థం ఉధృతికంగా జాలువారుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులు ప్రజలు. అరకు అందాలను తలపిస్తుందని పలువురు భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కపిల తీర్థంలో కొండ అంచుల నుంచి జాలువారుతున్న వాటర్ ఫాల్స్ చాలా అందంగా అద్భుతంగా ఉందని భక్తులు పరవశించిపోతున్నారు.

సహజంగా వాటర్ ఫాల్స్ చూడాలంటే ఖర్చుతో కూడుకున్నది, అయితే తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు, స్వామివారి దర్శనంతో పాటు ప్రకృతి అందాలు చూస్తూ ఆనందిస్తున్నారు. చిన్నలు పెద్దలు సైతం ప్రకృతి అందాలలో సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తిరుమల యాత్రకు వచ్చే భక్తులు కపిలతీర్థంలో స్నానాలు ఆచరించి…. శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించి తిరుమల యాత్ర ప్రారంభించడం ఆనవాయితీ. ఈ వర్షాలకు కపిల తీర్థం లొ నీరు ఉదృతంగ ప్రవహించడం వలన స్నానాలకు అనుమతి లేదు.. ఇలాంటి అందాలను ఆశ్వదించాలంటే మనం ఇపుడే తిరుమల బయలుదేరాల్సిందే.............మాచర్ల హరిప్రసాద్, రిపోర్టర్, తిరుమల

HARI PRASAD

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :