Thursday, 11 June 2026 10:45:41 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు –

Date : 11 May 2026 07:26 PM Views : 1047

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు యాదవ్ పుంగనూరు : పుంగనూరు నియోజకవర్గంలో వైద్య సౌకర్యాల లేమి కారణంగా సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, మృతదేహాలను తరలించడానికి కనీసం అంబులెన్స్ కూడా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని భారత చైతన్య యువజన పార్టీ పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు యాదవ్ తీవ్రంగా విమర్శించారు.చౌడేపల్లి మండలం, ఎగువ మల్లెవారిపల్లిలో క్రికెట్ ఆడుతూ 30 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హరిబాబు యాదవ్ మాట్లాడుతూ వ్యవస్థల వైఫల్యం: "ఒక యువకుడు ప్రాణాలు కోల్పోతే,ఆ మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ గానీ, వాహన సౌకర్యం గానీ లేక స్నేహితులు బైక్‌పై తీసుకువెళ్లడం చూస్తుంటే మనం 2026లో ఉన్నామా? లేక 1970ల నాటి చీకటి రోజుల్లో ఉన్నామా? అనిపిస్తోంది."అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సూటి ప్రశ్న: అభివృద్ధి అంటే కేవలం ప్రచారాలేనా? ప్రజల ప్రాణాలు పోతుంటే స్థానిక ఎమ్మెల్యే,అధికార పార్టీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రధాన డిమాండ్: పుంగనూరు నియోజకవర్గ ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం పేరుకే పరిమితమయ్యాయని విమర్శించారు.ఈ ఘటనలో మరణించిన యువకుడి కుటుంబానికి బీసీవై పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని హెచ్చరించారు.లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హరిబాబు యాదవ్ స్పష్టం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :