Thursday, 11 June 2026 10:56:42 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు.

-- రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ ఎస్సై నరేష్.

Date : 26 March 2026 08:59 PM Views : 415

Famous TV - క్రైమ్ వార్తలు / కోనసీమ : జొన్నాడ (ఆలమూరు) హెల్మెట్ భారం కాదు.. మన ప్రాణానికి రక్షణ కవచమని మన కోసం ఇంట్లో ఎదురుచూసే ప్రాణాలున్నాయని, హెల్మెట్ ధరించడం మర్చిపోకూడదని, తల రాతను మార్చలేం కానీ... తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించుకోవచ్చునని రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ అన్నారు. ఆలమూరు మండలం జొన్నాడ నుండి మడికి వరకు 216ఏ జాతీయ రహదారిపై వెళ్ళు ద్విచక్ర వాహనదారులకు ఆలమూరు ఎస్సై జి నరేష్ తో కలిసి హెల్మెట్ దారణపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ విద్యాసాగర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకోవాలని, రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా హెల్మెట్లు ధరించాలని అన్నారు. స్టైల్ కోసం హెల్మెట్ వదలద్దని, మన లైఫ్ కోసం హెల్మెట్ మరువద్దని, బైక్ రేస్ కాదు.. హెల్మెట్ లేకపోతే నీజీవితం లాస్ అని మీ తల మీ కుటుంబానికి ఆస్తిని దానిని జాగ్రత్తగా చూసుకోండని హెచ్చరించారు. అనంతరం హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలను వివరిస్తూ ప్రాణాపాయం నుండి రక్షణ రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాలలో 80% పైగా తలకు తగిలిన గాయాల వల్లే జరుగుతాయని, హెల్మెట్ ధరించడం వల్ల మెదడుకు గాయం అయ్యే ప్రమాదం 70% నుండి 80% వరకు తగ్గుతుందని, కంటి రక్షణ హెల్మెట్ ముందు ఉండే గ్లాస్ ప్రయాణ సమయంలో గాలి, ధూళి, పురుగులు, ఇసుక రేణువులు కంట్లో పడకుండా కాపాడుతుందని, దీనివల్ల దృష్టి మళ్ల కుండా ప్రశాంతంగా వాహనం నడపవచ్చునని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల జరిమానాలు కట్టాల్సిన అవసరం ఉండదుని, ఇది మీ ఆర్థిక పొదుపుతో పాటు బాధ్యతా యుతమైన పౌరుడిగా గుర్తింపునిస్తుందని అన్నారు. అనంతరం హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :