Friday, 12 June 2026 01:47:34 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మైనర్ బాలిక ప్రేమ విషయం తెలిసి పెళ్ళిచేయాలని కుటుంబ సభ్యులు ప్రియుడుతో జంప్ చేసిన మైనర్ బాలిక

Date : 02 November 2025 06:17 AM Views : 741

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలో ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక మేనత్త కుమారుడిని ప్రేమించినది, ఐతే అతడికి ఇచ్చి వివాహం చేయకూడదనుకున్న తల్లిదండ్రులు తమ సమీప బంధువులకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారని బంధువులు తెలియజేశారు.ఐతే సదరు మైనర్ బాలికకు వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయడం తో సదరు మైనర్ బాలిక తన ప్రియుడుతో కలసి అక్టోబర్ 27 న జంప్ అయ్యింది. ఈ క్రమంలో మైనర్ బాలిక తల్లిదండ్రులు స్థానిక చౌడేపల్లి పోలీస్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీసులు ఈరోజు,రేపు అంటూ నిర్లక్ష్యం చేశారని, వారిని వెతికి తీసుకొని రావలసిన పోలీసులు ఊరుకున్నారని, మైనర్ బాలిక తల్లిదండ్రులే వారిని వెతికి శనివారం 1 నవంబర్ 2025 రాత్రి సుమారు ఏడు గంటలకు పోలీస్టేషన్ కు తీసుకొని వచ్చారని,కేసునమోదు చేయమంటే చౌడేపల్లి ఎస్సై దురుసుగా మాట్లాడారని,అలాగే నోటితో చెప్పుకోలేని విధంగా భూతుపురాణం మాట్లాడారని మైనర్ బాలిక బంధువులు ఆరోపించారు. అంతే కాకుండా సదరు బాలుడు కూడా మైనర్ కావడం విశేషం, బాలుడి తరపున వారి బంధువులు మాట్లాడుతూ మైనర్ బాలికకు వివాహ ప్రయత్నాలు చేయడం నేరమని, వారు వివాహ ప్రయత్నాలు చేశారు కాబట్టే మైనర్ బాలిక తన ప్రియుడుతో జంప్ అయ్యిందన్నారు. ఇదిలా ఉండగా ఎస్సై బాలిక తరపు బంధువులను భూతులు తిట్టాడని, ఎస్సై డౌన్, డౌన్ అంటూ నినాదాలతో పోలీస్టేషన్ ప్రాంగణం హోరెత్తినది.వెంటనే ఎస్సై కలుగజేసుకుని బాలిక తరపున ఎవరైనా ముగ్గురు నలుగురు లోనికి రావాలని చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తామని ఇరువర్గాలు తెలియజేశారు.ఇదిలా ఉండగా మండలంలో చాలా చోట్ల బాల్యవివాహాలు జరుగుతున్నా ఐసిడియస్ సిబ్బంది, పోలీసులు పట్టించుకోకుండా ఉన్నారని పలువిమర్శలు వస్తున్నాయి. అవగాహన చర్యలు ఎక్కడ చేయడంలేదు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :