Thursday, 11 June 2026 10:46:26 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన

Date : 11 May 2026 09:30 PM Views : 374

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి అన్నమయ్య జిల్లా ఎస్పీ దిరాజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు చౌడేపల్లి మండలం శికారిపాళ్యం లో మహిళల భద్రతపై శక్తి టీం మరియు చౌడేపల్లి పోలీసులు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరై మహిళల భద్రతకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై అవగాహన పొందారు.ఈ సమావేశంలో ముఖ్యంగా రహదారి భద్రత,డ్రగ్స్ నివారణ,సైబర్ నేరాల పట్ల అప్రమత్తత,మహిళల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై పోలీసు అధికారులు సమగ్రంగా వివరించారు.సామాజిక మాధ్యమాలు,ఫోన్ కాల్స్,ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని హాజరైన వారికి తెలియజేశారు.అదేవిధంగా,మహిళలు ఎలాంటి ఆపద పరిస్థితులు ఎదురైనప్పటికీ భయపడకుండా వెంటనే స్పందించి సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాల్సిన విధానం గురించి వివరించారు.అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన టోల్‌ఫ్రీ నంబర్లు,పోలీసు సహాయ సేవల వివరాలను కూడా సమావేశంలో తెలియజేశారు.మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని,అప్రమత్తతతో వ్యవహరించడం ద్వారా అనేక నేరాలను ముందుగానే నివారించవచ్చని అధికారులు సూచించారు.ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చౌడేపల్లి సబ్ ఇన్ స్పెక్టర్ చిన్న రెడ్డప్ప,శక్తి టీం సిబ్బంది మునికుమార్ నాయక్,మణికంఠ,వీణ మరియు చౌడేపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :