Famous TV - ఆరోగ్యము / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైద్య పథకమే ప్రాజెక్ట్ సంజీవని. ప్రతి ఇంటి వద్దకే అత్యున్నత వైద్య సేవలను అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ప్రత్యేక వైద్య బృందాలు చేరుకుని దాదాపు 40 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తాయి.పరీక్షల అనంతరం అవసరమైన 80 రకాల మందులను ఉచితంగా అందజేస్తారు.డిజిటలైజేషన్ చేస్తూ సేకరించిన నమూనాల పరీక్షా ఫలితాలు సాయంత్రానికల్లా మొబైల్ ఫోన్‌లకు పంపబడతాయి.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రత్యేక కార్డును జారీ చేసి, దాని ద్వారా వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో టెలిమెడిసిన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 50 లక్షల మందికి పైగా ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఇందులో భాగంగా ఆశా కార్యకర్తలు ఇల్లిల్లు తిరుగుతూ ఆధార్ నెంబర్ తో అభా కార్డు యూనిక్ కోడ్ చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం చిన్నకొండామర్రి గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు.
Admin
Famous TV