Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఆదివారము ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం నందు ఈరోజు, రేపు చిన్న పిల్లల విభాగం లో నవజాత శిశువులో వచ్చే శ్వాస కోస వ్యాధులు పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్, రుయా ఆసుపత్రి అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు సూపరిటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు శిక్షణ, డెమో కార్యక్రమాన్ని ప్రారంభించారు. "నవజాత శిశువుల లో వచ్చే శ్వాస కోస వ్యాధులు " దానికి వైద్యం అనే అంశములు మీద వైద్యులకు నర్సింగ్ సిబ్బందికి మరియు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బందికి 108 సిబ్బందికి శిక్షణ కార్యక్రమం. న్యూయార్క్ -అమెరికా నుండి వచ్చిన నవ జాత శిశు వైద్య నిపుణులు డాక్టర్ .సతీష్ దేవపట్ల, నవజాత శిశువులలో వచ్చే శ్వాస కోస వ్యాధుల గురించి దానికి ఇవ్వవలసిన వైద్యం గురించి శిక్షణ కు హాజరైన ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలలో వస్తున్న శ్వాసకోశ వ్యాధులను ఎలా అరికట్టాలి దానికి కావలసిన నైపుణ్యతను తెలుసుకొని చిన్నపిల్లలకు మెరుగైన వైద్యం అందించటం కొరకు ఈరోజు వైద్యులకు వైద్య సిబ్బందికి అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ సతీష్ దేవపట్ల , శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మోడరేటర్ గా అంకురా హాస్పిటల్ నియోనెటాలాజిస్ట్ డా.మౌనిక. డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, వైష్ణవి హాస్పిటల్ నిర్వహించారు. శ్రీకాళహస్తి, నగరి,నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్స్ నుండి 70 మంది నర్సింగ్ ఆఫీసర్స్, 10 మంది వైద్యులు , 108 సిబ్బంది కి " బేసిక్ నియోనేటల్ రెసుసైటేషన్ (resuscitation)" ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు రోజులు ట్రైనింగ్ లో తర్ఫీదైన వైద్యులు చిన్నపిల్లలకు శ్వాస కోస వ్యాధులు మెరుగైన వైద్యం అందించడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్ ఈ సందర్భంగా తెలిపారు. దీనికి డా రాజేష్, డా శశికుమార్ డా.సుకన్య, డా.స్పందన, డాక్టర్ గీత ఫెసిలిటేటర్స్ గా వున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిరీటి, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. డా.అంజన్ కుమార్ పర్యవేక్షణ లో డా.ముని మోహన్ నిర్వహించారు.
Admin
Famous TV