Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శ్రీ వేంకటేశ్వర రామ నారాయణ రుయా ఆసుపత్రి విభాగం ఆధ్వర్యంలో బి.పి. ఎన్.ఐ. సంస్థ(BPNI-Breastfeeding promotion network of india-Newdelhi) వారితో కలిసి పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి బిడ్డ పుట్టి నప్పటి నుంచి రెండు సం+ వయసు వరకు అందించ వలసిన తల్లి పాలు మరియు ఆరునెలల మీదట తల్లిపాలతో పాటు ఇంటిలో వండిన ఆహారం అదనంగా అందించవలసిన అంశాలపై ఒక వారం రోజుల సర్టిఫికెట్ కోర్సు పై శిక్షణా కార్యక్రమం. ఈ రోజు గర్భిణీ స్త్రీలు విభాగం లో ప్రారంభం అయింది . ఈ సందర్భంగా ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం కు వివిధ రాష్ట్రాల నుంచి 24 మంది ఉద్యోగులు (07,)ఏడు రోజులు పాటు శిక్షణ పొందనున్నారు. ఈ శిక్షణ అనంతరం వీరు వివిధ గ్రామీణ, మరియు పట్టణ, కేంద్రాల్లో తల్లి బిడ్డకు పాలు ఇవ్వడంలో మెలకువలు తెలుసుకొని, అందులో ఆ సంరక్షణలో గురించి శిక్షణ కార్యక్రమంలో నేర్చుకొని గ్రామీణ ప్రాంత తల్లులకు మెలకువలు నేర్పడంలో వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల తల్లి బిడ్డ సంరక్షణకు ఎంతో దోహదపడుతుందని అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డా చంద్రశేఖరన్ ,రుయా ఆసుపత్రి సూపరిం టెండెంట్ డా రవిప్రభు ,గర్భిణీ స్త్రీల ఆసుపత్రి సూపరింటెండెంట్ డా పార్థసారథి రెడ్డి , గర్భిణీ స్త్రీల విభాగo డా ప్రమీలా దేవి ,చిన్న పిల్లల విభాగo డా మనోహర్ ,డా ఆర్ ఆర్ రెడ్డి ,డా కిరీటి , డా శశికుమార్ రెడ్డి పాల్గొని శిక్షణాకార్యక్రమాలను ప్రారంభించారు. విశ్రాంత ఆచార్యులు, సీనియర్ చిన్న పిల్లల వైద్య నిపుణులు డా ఆరుముగం ఘనంగా సన్మానించారు. దేశం లో పలు రాష్ట్రాల నుంచి 24 మంది శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షకులుగా కోర్స్ డైరెక్టర్ డా కేశవులు (హిందూపురం), డా శ్రీనివాసన్(పాండిచ్చేరి), డా మంజుబాల దాస్(పాండిచ్చేరి), డా రఘునాథ్ (ఆదోని)పాల్గొంటున్నారు, మరియు ఎస్ వి. వైద్య కళాశాల పి.ఆర్.ఓ. వీర కిరణ్ పాల్గొన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో భారతదేశంలో ని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వైద్యులు, స్టాఫ్ నర్స్ లు, మరియు న్యూట్రిస్టనిస్ట్ లు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV