Friday, 12 June 2026 12:22:49 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఔషధాల వలన కలిగే దుష్ప్రభావాలు పైన వారం రోజుల ముగింపు అవగాహన కార్యక్రమం

Date : 23 September 2023 07:29 PM Views : 617

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఎస్ వి వైద్య కళాశాల ఔషధ విభాగం ఆధ్వర్యంలో ఫార్మకో విజిలెన్స్ వారోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. ముగింపు సమావేశంలో ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ రోగి ఔషధాలను ఎలా పడితే అలా వాడుకుండా వైద్య నిపుణులు యొక్క సలహాలు తీసుకొని రోగి ఔషధాలను వాడు కొనవలేను అని వైద్య విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు. అందులో కలిగే దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు వైద్య నిపుణులకు రోగి తెలిపినట్లైతే, రోగికి మెరుగైన వైద్యం అందించవచ్చు అని ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా ఔషధ విభాగాధిపతి డాక్టర్ వసుంధర దేవి మాట్లాడుతూ ఔషధాలు వాటి వాడకాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలకు రోగికి అర్థమయ్యేలా ప్రతిరోజు వైద్య నిపుణులు చేత అవగాహన కార్యక్రమం వారం రోజులు పాటు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వారం రోజులు పాటు సెప్టెంబర్ 17 నుండి 23 వ తేది వరకు ప్రతిరోజు ర్యాలీ ,పోస్టర్ ప్రజెంటేషన్ , తిరుపతి పరిసర ప్రాంతాల స్కూలు నందు విద్యార్థులకు మరియు టీచర్లకు అవగాహన కార్యక్రమం, వైద్య విద్యార్థులకు, నర్సింగు, పారామెడికల్ విద్యార్థులకు, మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగులకు, నేషనల్ ఫాముకో విజిలెన్స్ న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు వారం రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినదని అని అన్నారు. వైద్య విద్యార్థులకు నర్సింగ్ మరియు పారామెడికల్ విద్యార్థులకు, క్విజ్ ప్రోగ్రాం , పోస్టర్, తయారు చేయడం ,ఓపి నందు రోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. చివరి రోజు అయిన ఈ రోజు ఇందులో పాల్గొనబడిన వైద్య విద్యార్థులకు , సర్టిఫికెట్లు మరియు పారితోషకము ప్రిన్సిపల్ ద్వారా అందజేశారు . ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అకడమిక్ మరియు ఫార్మకాలజి విభాగాధిపతి డాక్టర్ బి వసుంధర దేవి, వైస్ ప్రిన్సిపల్ (అడ్మిన్) డాక్టర్ వెంకటేశ్వర్లు, ఫార్మకో విజిలెన్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.ఆశాలత ,డిప్యూటీ కో ఆర్డినేటర్ డాక్టర్ యు. భారతి, ఫారం కో విజిలెన్స్ సీనియర్ అసోసియేట్ డాక్టర్ రాజ్యలక్ష్మి మరియు ఫార్మకాలేజీ విభాగ వైద్యులు యూజీ, పీజీ వైద్య విద్యార్థులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :