Famous TV - ఆరోగ్యము / తిరుపతి : బుధవారం ఎస్ వి వైద్య కళాశాల, ప్రసూతి ఆస్పత్రి లో తిరుపతి రోటరీ క్లబ్ వారి సహాయార్థంతో ప్రసూతి వైద్యశాల నందు తల్లిపాలు నిల్వ ఉంచే నిధి, ప్రారంభోత్సవం (Human Milk Bank ). ప్రసూతి వైద్యశాల రెండవ అంతస్తు నందు తిరుపతి రోటరీ క్లబ్ సభ్యులు మరియు ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్, డాక్టర్ చంద్రశేఖరన్, రుయా ఆసుపత్రి, అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, మరియు ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్, డాక్టర్ పార్థసారధి రెడ్డి, చేతులు మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినది. ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ( తల్లిపాల నిధి ) అంటే ఏమిటి? ఒక మహిళ తమ బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను, స్వచ్ఛందంగా దానం ఇవ్వడానికి ముందుకు వచ్చే ఆరోగ్యకరమైన తల్లులు దగ్గర నుంచి పాలను సేకరించి, సమగ్రంగా అన్ని పరీక్షలు నిర్వహించి, భద్రపరిచి, అవసరమైన చిన్నారులకు అందిస్తారు. దీనినే తల్లిపాల నిధి అంటారు. ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, మాట్లాడుతూ తల్లిపాలకు కుల, మత, వర్ణ, వర్గ పేద ధనిక భేదాలు లేవు. ఆరోగ్యకరమైన ఏ తల్లి ఇచ్చిన పాలనైనా ఏ బిడ్డకైనా పట్టవచ్చు అనే నినాదంతో ఈరోజు రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి నందు తిరుపతి రోటరీ క్లబ్ వారి సహాయార్థంతో ఈరోజు ప్రారంభించబడినది. కావున చిన్నపిల్లల తల్లులు, ఈ గొప్ప అవకాశాన్ని ఉచితముగా అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు మాట్లాడుతూ దాతల నుండి పాలు రెండు విధాలుగా సేకరిస్తారు,1). దాత ఇంటి నుండి,2). మిల్క్ బ్యాంక్ యూనిట్ స్థాపించబడిన వైద్యశాల నుండి, ప్రస్తుతము తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో రెండవ అంతస్తు రూమ్ నెంబర్ 5, 6,లలో ఈ భాగం ఏర్పాటు చేయడమైనది. బ్రెస్ట్ పంపు ద్వారా 30 నుంచి 40 మిల్లీ లీటర్ల వరకు దాతలు పాలు ఇవ్వవచ్చు. దాతలు తమ సమ్మతిని తెలియజేసే దరఖాస్తును ఆధార్ కార్డు ఆధారిత చిరునామా ఇవ్వవలసి ఉంటుంది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన డాక్టర్ సంతోష్ కుమార్, సుశానా హెల్త్ ఫౌండేషన్, మరియు నేషనల్ మెడికల్ కమిషన్ మెంబర్ మాట్లాడుతూ ఒక తల్లిగా మీ పాలు ఇంకో బిడ్డకు ప్రాణం పోస్తుంటే ఆ సంతోషం వెలకట్టలేనిది. మిగులు పాలు ఉన్న తల్లులు ఆలోచించాల్సిన విషయం. తల్లిపాలు అందుబాటులో లేని పిల్లలను కాపాడుకుందాం తల్లిపాలు దానం చేద్దాం. అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన ఎంతైనా అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ తిరుపతి రోటరీ క్లబ్ కు కృతజ్ఞతలు, పాలను దానం వేసేటందువలన దాతలకు కలిగే లాభాలు ఎన్నెన్నో, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి, ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి య్యే కుటుంబ నియంత్రణకు సహకరిస్తుంది. పాలను బిడ్డలకు ఎక్కువ కాలం ఇవ్వడం వలన నెలసరి రాకుండా వాయిదా పడి రక్తస్రావయం నష్టం నివారింపబడుతుంది. తమ పాలను దానం చేసి పొత్తిళ్లలోని పిల్లలను కాపాడటం తమకు ఆనందాన్నిస్తుందని తల్లులు అంటున్నారు. ఈ పవిత్ర కార్యం తమ బిడ్డకు ఆశీర్వాదంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిడియాటిషన్ తిరుపతి, సరితా చౌదరి కలకత్తా, డాక్టర్ శ్రీనాథ్ మణికంఠ సీనియర్ కన్సల్టెంట్ నియో నేటాలజీ బెంగళూరు, ప్రసూతి వైద్య విభాగాధిపతి డాక్టర్ ప్రమీల, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్, చిన్నపిల్లల విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఏఎస్ కిరీటి, తిరుపతి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పని రాజ్ కుమార్, సెక్రటరీ రోటరీ క్లబ్ రవికుమార్, చైర్మన్ దామోదరం, కో చైర్మన్ హేమచంద్ర, తిరుపతి రోటరీ క్లబ్ డైరెక్టర్ కమ్యూనిటీ సర్వీసెస్ పురుషోత్తం రెడ్డి, రోటరీ క్లబ్ సిబ్బంది, ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రి, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్వో వీర కిరణ్ పాల్గొన్నారు .
Admin
Famous TV