Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శుక్రవారం రుయా ఆస్పత్రి చిన్నపిల్లల శాస్త్ర చికిత్స విభాగము నందు ఈరోజు అరుదైన శాస్త్ర చికిత్స పుట్టిన బిడ్డకు చేయడం జరిగింది. ఈ అరుదైన ఆపరేషన్ను చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్, ఆధ్వర్యంలో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సుధాకర్ , పర్యవేక్షణలో చిన్నపిల్లల శాస్త్ర చికిత్స విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ కిరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా, గల్లిపాలెం గ్రామం నుంచి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ, చిన్న బిడ్డకు అత్యవసర శాస్త్ర చికిత్స చేయవలసిన నిమిత్తం, రుయా ఆసుపత్రి చిన్నపిల్లల విభాగ లో శాస్త్ర చికిత్స అందించిన డాక్టర్ రాజ్ కిరణ్, పుట్టిన బిడ్డకు మలం ద్వారం పూర్తిగా మూసుకోవడం తో వెంటనే శాస్త్ర చికిత్స అందించిన రుయా చిన్నపిల్లల వైద్యులు. ఈ అరుదైన చికిత్సను అందించి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ అరుదైన చికిత్స పూర్తిగా ఉచితంగా చేసి ఆరోగ్యశ్రీ వైద్యం అందించడం జరిగినది. ప్రైవేట్ ఆసుపత్రి నందు ఈ వైద్యం అందించాలంటే సుమారు లక్షన్నర దాకా ఖర్చయ్య అవకాశాలు ఉంటుందని అయినా తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ జగదీష్ నర్సింగ్ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.
Admin
Famous TV