Thursday, 11 June 2026 10:44:29 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు

Date : 10 June 2026 09:07 PM Views : 740

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని కొన్ని పంచాయతీలలో మహిళలు అధిక వడ్డీ ఐదురూపాయలు, పది రూపాయల కు ఆశపడి లక్షల్లో అప్పులిచ్చి, మోసపోయిన సందర్బాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా అధిక వడ్డీకి నగదు తీసుకొనే వారు ఖాళీ ప్రామిసరీ నోట్లపైన సంతకాలు చేయించుకొని డబ్బులు అప్పుగా ఇస్తున్నారు.ఈ క్రమంలో గత పరికిదొన,నూనెముద్దల పల్లి, సింగిరి గుంట, మొడుకూరు,దొనపల్లి,చౌడగానిపల్లి,చారాల, దుర్గసముద్రం,పెద్దకొండామర్రి, కాగతి, యల్లంపల్లి, కాటిపేరి,పుదిపట్ల,లద్దిగం,ఆమినిగుంట,చౌడేపల్లి వంటి గ్రామాలలో పదిహేను రోజులకు వడ్డి కూడా చెల్లించాలి.ఈ విధంగా వడ్డీ వ్యాపారంతో అధిక వడ్డీ చెల్లించలేక ఎందరో తమ విలువైన భూములు,ఆభరణాలు వదులుకుంటున్నారు. చాలా గ్రామాలలో ఖాళీ పత్రాలు దర్శనమిస్తున్నాయి.ఈ నేపత్యంలో గత రెండురోజుల క్రితం కూడా రెండు వర్గాలు కొట్టుకున్న దాఖలా కూడా ఉంది. వారిని మా ప్రతినిధి విచారించగా దిమ్మతిరిగే నిజాలు భయటపడ్డాయి. నూటికి పదిహేను రోజులకు ఐదురూపాలు వడ్డి, ప్రతి పదిహేను రోజులకు ఖచ్చితంగా చెల్లించాల్సిందే,అలా కాకపోతే ఇండ్లు,పొలాలు,వాహనాలు లాక్కుంటారు.అంతే కాకుండా ఇటువంటి వడ్డీ వ్యాపారులకు అప్పనంగా డబ్బులు వస్తాయి కాబట్టి వారు రౌడీషీటర్లను,రాజకీయ నాయకులను బాగా మేపుతున్నారు. వాళ్ళకు వడ్డీ లేకుండా పైకము ఇచ్చి వసూళ్ళకోసం వీళ్ళ పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారు.మండలం లో ఒకే కుటుంబం సుమారు ఎబ్బైలక్షలు అప్పులు ఇచ్చినది అంటే వారికి ఆదాయం ఎలా ఉందో ఆలోచించండి. ఆదాయపు పన్ను అధికారులు ఇటువంటి వాళ్ళ ఇళ్ళలో ఎఃదకు సోదాలు చేయడంలేదు.వాళ్ళ బంధువులు, నమ్మకస్తులు,ఇండ్లలో,వారి ఫోన్ కాల్ డేటా కల్గిన వారి ఇండ్లలో ఒక్కసారిగా సోదాలు నిర్వహిస్తే ఎఃతమఃది బయటపడుతారో.కాబట్టి ఇటువంటి వారికి లైసెన్స్ కూడా ఉండదు. ఇటువంటి వారిపైన అధికారులు సోదాలు నిర్వాహించాలని పలువురు అభిప్రాయం తెలియజేస్తున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :