Friday, 12 June 2026 12:28:11 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్భందీగా నిర్వహించండి - డి ఆర్ ఓ కె.మోహన్ కుమార్

Date : 21 January 2026 07:18 PM Views : 635

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవి న్యూస్ : జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026 లో భాగంగా జనవరి 27 నుండి ఫిబ్రవరి 10 వరకు నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని డి ఆర్ ఓ కె.మోహన్ కుమార్ పేర్కొన్నారు.బుధవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని డి ఆర్ ఓ ఛాంబర్ లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు – 2026 లో భాగంగా జనవరి 27 నుండి పిబ్రవరి 10 వ తేదీ వరకు మొదటి, ద్వితీయ సంవత్సరానికి సంబందించి ప్రాక్టికల్ పరీక్షలను 71 సెంటర్ల (ఒకేషనల్ సెంటర్లతో) కలిపి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.మొదటి సంవత్సరం థియరీకి సంబందించి 14,729 మంది, ద్వితీయ సంవత్సరం థియరీకి సంబందించి 14,550 మంది, మొత్తం 29,279 మంది హాజరు అవుతారని, ప్రాక్టికల్ మొదటి సంవత్సరానికి సంబంధించి 1470 మంది, ప్రాక్టికల్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 9937 మంది, మొత్తం 11,407 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు చర్యలు చేపట్టాలని,సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆర్ టి సి వారు బస్సులను నడపాలని,పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్కో అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించుటలో సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా వారు పరీక్షా కేంద్రాల వద్ద ఏమైనా సంఘటనలు జరిగితే డిఐఈఓ వారి దృష్టికి తీసుకొని వెళ్లాలన్నారు.ఈ సమావేశంలో డిఐఈఓ ఏ.రఘుపతి,టు టౌన్ సి ఐ నెట్టికంఠయ్య,సి సెక్షన్ సూపరింటెండెంట్ బ్యూలా,జిల్లా పరీక్షల నిర్వాహణ కమిటీ సభ్యలు ఎన్.సయ్యద్ మౌల,ఎన్.దయానంద రాజు,మురళీధర్,వెంకటరమణ రెడ్డి, జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్, మెడికల్,విద్యుత్,ఏ పి ఎస్ ఆర్ టి సి,పోస్టల్,ఇతర సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :