Thursday, 30 July 2026 11:05:38 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఏసీబీ వలలో సీఐ, ఎస్సై

లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా.

Date : 08 June 2023 07:20 PM Views : 395

Famous TV - క్రైమ్ వార్తలు / శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సీఐ శ్రీనివాసరావు, ఎస్సై మురళి అవినీతి నిరోధక శాఖ అధికారులు పన్నిన వలలో చిక్కారు. మద్యం అక్రమ రవాణా కేసులో రూ.15,000 లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్​హ్యండెడ్​గా పట్టుబడ్డారు.  డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జి.సిగడాం మండలం నిద్దంకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మే 25వ తేదీన 5 మద్యం సీసాలను తీసుకెళ్తుండగా పొందూరు సమీపంలో ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అయితే స్థానిక పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీనిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 15 వేల రూపాయలు లంచం ఇవ్వాలని సీఐ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. రూ. 15 వేలు ఇస్తే అతడికి బదులుగా మరో వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. అంత నగదు ఇవ్వలేని పరిస్థితుల్లో రూ. 5వేల రూపాయలు ఇచ్చి.. తన కేసును మరొకరిపై నమోదు చేసేందుకు అతడే మరో వ్యక్తిని తీసుకుని రావాలని నిందితుడితో సీఐ అన్నారు. ఈ విధంగా నిందితుడు లంచం ఇస్తే.. అతడిని కేసు నుంచి తప్పిస్తామని ఆయన చెప్పారు. అయితే నిందితుడు నగదు ఇవ్వకపోవటంతో రోజూ అతడిని స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. దీంతో విసుగు చెందిన నిందితుడు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు నిందితుడు ఎస్​ఈబీ సీఐకీ ఫోన్​ చేసి అడిగిన నగదును ఇస్తానని చెప్పాడు. అయితే తాను విశాఖపట్నంలో ఉన్నానన డబ్బులను స్టేషన్​లో ఉన్న ఎస్​ఐకు ఇవ్వమని సీఐ చెప్పారు. దీంతో నిందితుడు పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఎస్​ఐ మురళికి రూ. 15 వేలు లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. విశాఖలో ఉన్న శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు పొందూరు తీసుకొచ్చారు. సీఐ,ఎస్ఐలను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: