Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లే. కానీ ఇప్పుడు అదే మామిడి ప్రజల్లో భయాన్ని పెంచుతోంది.మార్కెట్‌లో బంగారంలా మెరిసే మామిడిపండ్ల వెనుక అసలు నిజం బయటపడుతోంది.సహజంగా చెట్టుపైన మగ్గాల్సిన మామిడి కాయలను గోదాముల్లో రసాయనాలతో గంటల్లోనే పసుపురంగులోకి మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.పుంగనూరు నియోజకవర్గం లో భారీగా సాగుతున్న ఈ కెమికల్ మామిడి దందా ఇప్పుడు ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది.బయటకు ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పండ్లు లోపల మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయంటున్నారు వైద్యులు.రోజుల గడిచేకొద్దీ సహజంగా మగ్గాల్సిన మామిడికాయలను.. రాత్రివేళ గోదాముల్లో నిల్వ చేసి రసాయనాల మధ్య కప్పిపెట్టి ఉంచుతున్నారు.తెల్లారేసరికి అవే పండ్లు సహజంగా మగ్గిన మామిడిపండ్ల పేరుతో మార్కెట్‌లోకి చేరుతున్నాయి.రంగు,మెరుపు చూసి ప్రజలు కొనుగోలు చేస్తున్నా.. వాటి వెనుక దాగి ఉన్న ప్రమాదం చాలామందికి తెలియడం లేదు.సహజంగా మగ్గిన పండ్లకు ఉండే వాసన, రుచి, నాణ్యత ఈ కెమికల్ పండ్లలో కనిపించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు.అయినా తక్కువ సమయంలో ఎక్కువ లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ రసాయనాలతో మగ్గించిన పండ్లు తింటే కడుపునొప్పి, వాంతులు, అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.మరో వైపు ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ప్రమాదకర రసాయనాలతో పండ్లను మగ్గపెట్టడం నిషేధం అయినా కొన్ని గోదాముల్లో యథేచ్ఛగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.అధికారుల తనిఖీలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.అందుకే బయట దొరికే మామిడి పండ్లు కొనేముందు జర భద్రం.బదులకు మీకు తెలిసిన తోటలు ఉంటే అక్కడకు వెళ్లి తెచ్చుకోవడం ఉత్తమం.
Admin
Famous TV