Thursday, 30 July 2026 07:19:32 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్

Date : 19 May 2026 06:02 PM Views : 472

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న పీజీఆర్ఎస్ (స్పందన) వ్యవస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా,నామమాత్రపు ఆన్‌లైన్ ప్రక్రియగా మారిపోయిందనే సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ తీవ్రమైన ఆవేదనను ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలియజేయడం జరుగుతోంది.ప్రజలు తమ బాధలను,అన్యాయాలను,అధికారుల నిర్లక్ష్యాలను న్యాయం కోసం ఈ వేదిక ద్వారా వినిపిస్తున్నప్పటికీ,అసలు సమస్యలు పరిష్కారం కాకుండానే “రిసాల్వ్డ్,రిడ్రస్స్డ్” అంటూ ఎండార్స్‌మెంట్‌లు జారీ చేయడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనం.ఈ వ్యవస్థలో పని చేస్తున్న కొంతమంది అధికారులు ప్రజా బాధ్యతను మరచి,విధులను టైంపాస్ ధోరణిలో నిర్వహించడం,ఫిర్యాదులను లోతుగా పరిశీలించకుండా ఫార్మాలిటీగా మూసివేయడం,బాధితులను మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి నెట్టడం అత్యంత దురదృష్టకరం. ప్రజలకు న్యాయం అందించాల్సిన వ్యవస్థే ప్రజల నమ్మకాన్ని ఛిద్రము చేస్తూ,అసంతృప్తి – అవమానం – మానసిక వేదనలకు కేంద్రంగా మారింది.పీజీఆర్ఎస్ వేదిక వల్ల ప్రస్తుతం ప్రజలకు లభిస్తున్నది పరిష్కారం కాదు,కేవలం డిజిటల్ మోసం మాత్రమే అనే అభిప్రాయం బలపడుతోంది.అంతే కాకుడా ఎవరైనా పిజిఆర్ఎస్ లో పరిష్కారం కొరకు సంతకాలు పెట్టకపోతే రాజకీయ నాయకుల వద్దనుండి బెదిరింపులు,దాడులు కూడా చేయిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు.“సమస్య పరిష్కరించబడింది”అని కాగితాలపై చూపించడం ద్వారా నిజ జీవిత సమస్యలు మాయమవ్వవు.ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం,నిబద్ధతలేని వ్యవహారం,బాధ్యతారాహిత్యం మరియు అహంకార ధోరణి, వారి విధి నిర్వహణలో పారదర్శకత,జవాబుదారీతనం ఏమాత్రము లేదు.ఈ వ్యవస్థను పూర్తిగా విఫలమయ్యే స్థితికి తీసుకువచ్చాయి.అందువల్ల,ప్రజలకు న్యాయం అందించలేని,కేవలం గణాంకాల కోసం నడుస్తున్న ఈ పీజీఆర్ఎస్ వ్యవస్థను తక్షణమే పునర్వ్యవస్థీకరించాలి లేదా ప్రజలకు ఉపయోగపడని స్థితిలో ఉంటే పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాము.ప్రజల సమస్యలను వింటున్నట్లు నటించడం కాకుండా,వాస్తవ పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.లేకపోతే ఈ వ్యవస్థపై ప్రజల్లో తిరుగుబాటు స్థాయి వ్యతిరేకత పెరగడం అనివార్యం.“ప్రజల న్యాయం ఫైళ్లలో కాదు,వాస్తవ పరిష్కారంలో ఉండాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :