Friday, 31 July 2026 07:32:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మట్టి వినాయకుడిని పూజించండి

ఘనంగా ముందస్తు వినాయక చవితి వేడుకలు

Date : 16 September 2023 06:04 PM Views : 1617

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : మట్టితో చేసిన వినాయకుని పూజించి పర్యావరణ రక్షణకై నడుంకట్టాలని డాక్టర్ అంకయ్య పిలుపునిచ్చారు.మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పాతవీరాపురం నందు ప్రధానోపాధ్యాయురాలు భువనేశ్వరి ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ముందస్తు వేడుకలలో భాగంగా విద్యార్థులందరిచే మట్టి వినాయకుని బొమ్మలను తయారుచేయించి వివిధ రకాల పోటీలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వే ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పైడి అంకయ్య పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాతవీరాపురం విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను చాలా చక్కగా తయారు చేశారని పిల్లల్లో సృజనాత్మకంగా దాగి ఉన్న కళ ను వెలికి తీసిన ఉపాధ్యాయులను ప్రశంసించారు. సోమవారం రోజు జరుపుకోబోయే వినాయక చవితి రోజున దేశమంతా అందరూ మట్టితో చేసిన వినాయక విగ్రహాలని పూజించి పర్యావరణం కలుషితం కాకుండా భావితరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందించాలని పిలుపునిచ్చారు.. కార్యక్రమంలో తెలుగు పండితులు డాక్టర్ దేవరాజులు మాట్లాడుతూ వే ఫౌండేషన్ వారు వినూత్న కార్యక్రమాలు చేస్తూ సమాజానికి మంచి సందేశం ఇస్తుంటారని పిల్లలందరూ ఈ కార్యక్రమం ద్వారా భావితరానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విష రసాయనాలతో కూడిన గణపతి విగ్రహాలను వాడకుండా మట్టి వినాయకుడిని పూజించడం ఎంతో శ్రేయస్కరమని పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అందంగా బొమ్మలు తయారుచేసిన విద్యార్థులకు వే ఫౌండేషన్ వారు బహుమతులు ప్రశంసా పత్రాలు అందించారు. పిల్లలు తయారుచేసిన విగ్రహాలు అతిథులను,గ్రామస్తులను, చూపరులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మజ వెంకటేశ్వర్లు, ఉషారాణి,అంగన్వాడీ కార్యకర్తలు,వే ఫౌండేషన్ వినోద్,చంద్ర శేఖర్ మరియు విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :