Friday, 12 June 2026 01:47:35 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

వైసీపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి

రాష్ట్ర గవర్నర్ కి నివేదించిన టీడీపీ నేతలు

Date : 08 June 2023 07:55 PM Views : 642

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : లోకేశ్ కి ముప్పు ఉంది, పాదయాత్రకు పటిష్ట బందోబస్తు కల్పించాలి నాలుగేళ్లలో మైనార్టీలపై జరిగిన దాడులపై చర్యలు తీసుకోండి విజయవాడ, సూర్య ప్రత్యేక ప్రతినిధి : వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ షరీఫ్, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్రలు గవర్నర్ ని కలిశారు. ఈ సంధర్బంగా యువగళం పాదయాత్రలో వైసీపీ నేతలు సృష్టిస్తున్న అడ్డంకులు, పోలీసులు వ్యహరిస్తున్న తీరు, రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడుల అంశాల్ని గవర్నర్ కు నివేదించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు కుంటు పడ్డాయి. ప్రజాస్వామ్యం లేదు, ప్రజలకు కనీసం మాట్లాడే స్వేచ్చ లేదు. ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలపై గత నాలుగేళ్లలో జరిగిన దాడులు గతంలో ఎన్నడూ జరగలేదు. మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు వంటి ఘటనలకు 50 పైకి జరిగాయి. ఇవన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి వీటిపై కమిటీ వేసి విచారణ జరపమని కోరాం. మరో వైపు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది. సభలు జరపకుండా అడ్డుకున్నారు, మైక్ లాక్కున్నారు. పాదయాత్రకు మా కార్యకర్తల్ని రానివ్వకుండా ఎక్కడిక్కడ వారి వాహనాలు పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల సహకారంతో వైసీపీ గూండాలు మా పార్టీ కార్యక్రమాల్లో చొరబడి దాడులు చేస్తున్నారు. లోకేశ్ పై కోడి గుడ్లు విసిరారు. లోకేశ్ కి ప్రాణహాని ఉందని పాదయాత్రకు పటిష్ట భద్రత కల్పించాలని డీజీపీ, గవర్నర్ కి మేం లేఖలు రాసినా స్పందన లేదు. 2016లో జరిగిన ఎన్ కౌంటర్ 22 మంది మావోయిస్టులు చనిపోయిన సంధర్బంలో చంద్రబాబు నాయుడు, లోకేశ్ పై దాడులు చేస్తామని నాడు మావోయిస్టులు బహిరంగంగా చెప్పారు. రాయలసీమలో కొంతమంది రౌడీలు ప్రెస్ మీట్ పెట్టీ మరీ లోకేశ్ ని అంతమెందిస్తామంటూ మాట్లాడారు. లోకేశ్ కి ఏం జరిగినా సీఎం జగన్ రెడ్డి బాధ్యత వహించాలి. లోకేశ్ పాదయాత్రకు భద్రత పెంచి పాదయాత్ర సజావుగా జరిగేలా చూడాలని గవర్నర్ ని కోరాం. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. టీడీపీ కార్యక్రమాలు జరిగే చోట వైసీపీ ప్లెక్సీలు కట్టి సైకోలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం ఉంటే అదే రోజు మరో పార్టీ ప్లెక్సీలు కట్టి కవ్వింపు చర్యలకు పాల్పడటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? మహానాడు జరిగిన రాజమండ్రిలో వైసీపీ ప్లెక్సీలు కట్టారు. చంద్రబాబు, లోకేశ్ లపై అసభ్య పదజాలం వాడుతూ పాదయాత్రలో ప్లెక్సీలు కట్టి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. వైసీపీ కార్యక్రమాలు ఉన్నచోట జగన్ చేసిన అవినీతిని వివరిస్తూ మేం కూడా ప్లెక్సీలు కడతాం. అప్పుడు ఈ పోలీసులు ఏం చేస్తారో చూస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. మాజీ మండలి చైర్మన్ ఎం.ఏ షరీఫ్* మాట్లాడుతూ మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వారి జీవితాలతో చెటగాటమాడుతున్నారు. 2019 నుంచి నేటి వరకు ముస్లింలపై జరిగిన దాడుల్ని గవర్నర్ కి వివరించాం. బాధితులు పోలీసు స్టేషన్ వెళ్తే కనీసం ఫిర్యాదులు తీసుకోవటం లేదు. 4 ఏళ్లలో మైనార్టీలపై భౌతిక దాడులు, మానభంగాలు, హత్యలు, ఆస్తుల విద్వంసం వంటి ఘటనలు అనేకం జరిగాయి. నంద్యాలలో అబ్దుల్ సలాంపై అక్రమ కేసులు బనాయించి హింసించి కుటుంబం మొత్తం ఆత్మహత్యలకు పాల్పడేలా చేశారు. పల్నాడు జిల్లాలో అనేక గ్రామాల్లో ముస్లిం, మైనార్టీలను గ్రామాల నుంచి తరిమేశారు. వీటన్నింటిపై గవర్నర్ కి ఫిర్యాదు చేశాం, విచారణ జరిపి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని ఎం.ఎ షరీఫ్ తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :