Friday, 12 June 2026 01:50:37 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

"సేవ్ ఎస్ వి యూనివర్సిటీ క్యాంపస్"

"సేవ్ నేచర్" నినాదంతో హైకోర్టు ని ఆశ్రయిస్తాను...నవీన్ కుమార్ రెడ్డి

Date : 28 July 2023 04:57 PM Views : 515

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ పరిరక్షణలో భాగంగా టీచింగ్ నాన్ టీచింగ్ విద్యార్థి సంఘాలు విద్యార్థిని విద్యార్థులు ప్రజాసంఘాలు ప్రజలు పూర్వ విద్యార్థులు అధ్యాపకులు అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని నవీన్ విజ్ఞప్తి! "మన ఎస్వీ యూనివర్సిటీ సంరక్షణ మనందరి బాధ్యత" శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల తొందరపాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ రాజారెడ్డి గారిని కలిసి వినతి పత్రం సమర్పిస్తున్న నవీన్ కుమార్ రెడ్డి! SV యూనివర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా అధికారులు అధికార పార్టీ నాయకులు నిర్ణయం తీసుకుంటే పూర్వ విద్యార్థిగా హై కోర్టుని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితులు తప్పవన్నారు తిరుపతికి విచ్చేయు విఐపి ల కోసం ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో రోడ్లు వేయాల్సిన అవసరం లేదని రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చే వివిఐపీలు తిరుచానూరు మార్కెట్ యార్డ్ గరుడ వారధి (శ్రీనివాస సేతు) ఫ్లై ఓవర్ పైనుంచి కపిలతీర్థం వరకు అక్కడి నుంచి అలిపిరి చేరుకొని తిరుమల కి ప్రజలకి ఎటువంటి ఆసౌకర్యం లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేరుకుంటారన్నారు! ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణ కాంపౌండ్ వాల్ దాటి ఎన్ని అడుగుల రోడ్లు వేసుకున్నా,ఎన్ని రోడ్లు వేసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదన్నారు! ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో 100 అడుగుల రోడ్లు వేస్తే క్యాంపస్ వాతావరణం పూర్తిగా కలుషితమైపోతుందని ఎప్పుడు పడితే అప్పుడు టిప్పర్లు లారీలు ప్రైవేటు వాహనాలు ఆటోలు ద్విచక్ర వాహనాలు హారన్ లు మోగించుకుంటూ రాకపోకలు సాగిస్తారని విద్యార్థినీ విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందన్నారు! ఎస్వీ యూనివర్సిటీలో క్యాంపస్ లో పబ్లిక్ రోడ్లు వేసి పచ్చటి వాతావరణాన్ని ప్రశాంతతను కలుషితం చేస్తున్నారన్న ఆవేదన పూర్వ విద్యార్థులలో,పదవీ విరమణ చేసిన ఎస్వీయూ ఉద్యోగస్తులతో పాటు ప్రస్తుతం క్యాంపస్ లో ఉన్న అన్ని వర్గాల వారిలో ఆందోళన కలిగిస్తుందన్నారు! SV యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రైవేటు వాహనాల రాకపోకలు ప్రారంభమైతే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుందని,ఆకతాయిల ఆగడాలు పెరిగి లేడీస్ హాస్టల్ విద్యార్థినులకు భద్రత కరువవుతుందన్నారు ఎస్వీ యూనివర్సిటీ VC గా యూనివర్సిటీ ప్రాముఖ్యతను, భద్రతను దృష్టిలో పెట్టుకొని అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని సముచిత నిర్ణయం తీసుకోవాలని శ్రీ రాజారెడ్డి గారిని నవీన్ విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు!

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :