Friday, 12 June 2026 01:43:16 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

అమర్ రాజా వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు గారి స్వగ్రామాన్ని సందర్శించిన ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ మహిళల బృందం.

Date : 16 March 2024 07:04 PM Views : 663

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : పూతలపట్టు , 16.03.2024: ఈరోజు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనుబంధ సంస్థ అయినటువంటి ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ సంస్థ కి చెందిన మహిళల బృందం అమర్ రాజా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారి స్వగ్రామైన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పెట్టమట్ట గ్రామం ని సందర్శించారు, ఇందులో భాగంగా రామచంద్ర నాయుడు గారు స్వగ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయిన అమరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సెంటర్, ఉచిత ఆరోగ్య కేంద్రం, స్కూల్స్ ,కళాశాలలు, నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరాముల వారి ఆలయం మరియు మరి ఇతర అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జరిగిన ఇష్టాగోష్టి లో గల్లా రామచంద్ర నాయుడు గారు వారి ప్రస్థానాన్ని కులంకషంగా వారికి వివరించారు. అనంతరం మహిళల బృందం డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారు తన స్వగ్రామాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినందుకుగాను వారు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ సంస్థ కి నూతనంగా చైర్మన్ గా ఎన్నికైన అమర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి గౌరీనేని గారిని సన్మానించారు. చివరగా నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ చైర్మన్ డాక్టర్ రమాదేవి గౌరీ గారు మరియు వారి బృందం శశిబిందు, శ్రీదేవి,సరిత, అనుపమ,కోమల, సులోచన ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :