Friday, 12 June 2026 01:50:36 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

సంతృప్తి చెందేలా రేషన్ పంపిణీ జరగాలి

రేషన్ అందలేదన్న మాట ఎక్కడా రాకూడదు : అరుణ్ కుమార్

Date : 29 November 2023 05:37 PM Views : 619

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, నవంబర్ 29: ఆహార భద్రత చట్టాన్ని గౌవరిస్తూ కార్డు దారులకు రేషన్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత మనపై వుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలోని తహసిల్దార్లతో , పౌరసరఫరాల శాఖ అధికారులతో జెసి డి కె బాలాజీ తో కలసి సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ సకాలంలో అందించాలని, పారదర్శకత వుండాలని అన్నారు. గౌ. ముఖ్యమంత్రి స్వయంగా రేషన్ కష్టాలు చూసిన మేరకు 2020 సంవత్సరం నుండి రేషన్ పంపిణీ లబ్దిదారులకు దగ్గరగా అందాలని మొబైల్ డిస్పెన్స్ వాహనాలు ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. రానున్న డిసెంబర్ నుండి పగద్భందీగా రేషన్ సరఫరాకు కోసం వాలింటర్ లకు ఎం డి యు వాహనాల ద్వారా పంపిణీ ప్రదేశాల వివరాలు పంపాలని , పంపిణీ రోజు తప్పనిసరి వాలింటర్ దగ్గరుండి భాద్యతగా పారదర్శకంగా సరఫరా జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి నెలా పంపిణీ 1 నుండే ప్రారంభం కావాలని, 17 నాటికి పూర్తి చేయాలని అన్నారు. ప్రతి నెలా తహసిల్దార్లు పంపిణీ పై ఎం.డి.యు ఆపరేటర్లతో, వాలింటర్ల తో కోఆర్డి నేషన్ మీటింగ్ జరపాలని, కచ్చితంగా ఏరోజు, ఏసమయం పంపిణీ వివరాలు ప్రజలకు ఒక రోజు ముందే తెపాలని అన్నారు. లబ్దిదారులు ఎక్కువగా కూలీలు ఉంటారని వారికి అనుకూల సమయంలో అందించేవిధంగా చూడాలని అన్నారు. డిసెంబర్ నుండి కేజీ రాగి (మిల్లెట్ల్స్)అందిస్తున్నామని , ఆరోగ్యపరంగా మంచిదని అన్నారు. మనం బియ్యం (సార్టేక్స్)సరఫరా చేస్తున్నామని ఆరోగ్యానికి మంచిదని తెలపాలని , ప్రక్కదోవ పట్టరాదని విజిలెన్స్ నిఘా వుండాలని, తరచూ ఆర్దిఒ లు, డిప్యూటి కలెక్టర్లు, తహసిల్దార్లు, తూనికలు, కొలతుల శాఖ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎం.డి.యు ఆపరేటర్లు నిలిచిపోతే రెండు నెలల్లో నియమించాలని, ప్రస్తుతం వాహన మిత్ర కూడా అందిస్తున్నామని , ఆపరేటర్లు ఒక మంచి పని పేదలకు అందిస్తున్న రేషన్ అనే బావన వుండాలని అన్నారు. ఈ సమీక్షలో జెసి పలు సూచనలు చేసారు. గూడూరు ఆర్దిఒ కిరణ్ కుమార్ , పౌరసరఫరాల అధికారి రాజ రఘువీర్ , డి ఎం సివిల్ సప్లె సుమతి, డిటిలు , తహసిల్దార్లు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :