Friday, 31 July 2026 07:35:01 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి..

Date : 29 April 2026 08:05 PM Views : 662

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలపై నిరంతర అవగాహన కల్పించాలి.. పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.. మదనపల్లి/పుంగనూరు/చౌడేపల్లి: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది అత్యంత గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలని, వారి సమస్యలను తక్షణమే పరిశీలించి చట్టపరిధిలో సత్వర న్యాయం అందించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారు ఆదేశించారు. బుధవారం ఆయన అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారితో కలిసి పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ల పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేర నియంత్రణ చర్యలపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించిన ఉన్నతాధికారులు.. పెండింగ్ కేసుల వివరాలను, స్టేషన్ పరిధిలోని నేరాల తీరును ఆరా తీశారు. పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్, లాకప్ గదులు, రైటర్ రూమ్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు, కార్యాలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నేరాలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. *ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి..* సమాజంలో పెరుగుతున్న నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రతివారం మహిళా పోలీసుల సమన్వయంతో పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రధానంగా మాదకద్రవ్యాల నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, మహిళలపై అఘాయిత్యాలు, ఆన్‌లైన్ మోసాలు, వైట్ కాలర్ నేరాలు, సైబర్ క్రైమ్‌పై ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు. ఆపద సమయంలో మహిళల భద్రత కోసం రూపొందించిన 'శక్తి యాప్' ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. *సీసీ కెమెరాలే కీలకం..* నేరాల నియంత్రణ, ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు, వ్యాపారస్తులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే, అధికారులు, మహిళా పోలీసులు సమన్వయంతో పనిచేసి రాబోయే 'లోక్ అదాలత్'లో అత్యధిక కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యేలా చూడాలని, పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ శ్రీమతి బి. పావని, పుంగనూరు సీఐ సుబ్బరాయుడు, పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్, పుంగనూరు ఎస్ఐలు అన్సర్ బాషా, రమణ, చౌడేపల్లి ఎస్ఐ చిన్నరెడ్డప్ప తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: