Friday, 31 July 2026 12:31:34 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Date : 16 March 2024 08:22 PM Views : 766

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : విశాఖ: రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పోలవరం ఇప్పటి వరకూ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే నాయకుడు లేకే ఏపీని మోడీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గత పాలకులు ఢిల్లీని గట్టిగా అడిగి హక్కులను సాధించుకునేవారని గుర్తు చేశారు. ఢిల్లీ శాసించి డిమాండ్లు నెరవేర్చుకునే నాయకులు ప్రస్తుతం ఏపీలో లేరని చురకలు అంటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైఎస్సార్ బిడ్డ ముందుకొచ్చారని తెలిపారు. వైఎస్ సంకల్పం నిలబెట్టేవారే వైఎస్ వారసులు అవుతారని తెలిపారు. వైఎస్ ఆశయాలు మర్చిపోయిన వారు వారుసులు ఎలా అవుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లమందరం అడ్డుకుందామన్నారు. హక్కుల విషయంలో తెలుగువారమంతా ఒక్కటవుదామని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు..

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :