Thursday, 30 July 2026 07:19:27 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

Date : 05 June 2026 08:50 PM Views : 527

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం,చౌడేపల్లి మండలంలోని పందిళ్ళపల్లి గ్రామంలో పోలీసులు శుక్రవారం పర్యటించి గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నివారణ,మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడుతున్నా,పేకాటలు,కోడిపందాలు నిర్వహిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మహిళలు,బాలికల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.ఆడపిల్లలను వేధించే వారు,అసభ్యంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించబోమని,అలాంటి ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.అదేవిధంగా రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.ప్రజల సహకారంతో నేరరహిత గ్రామంగా పొందల్లపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :