Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శనివారం : వైద్య పరిశోధన పై ఎస్వీ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తో పరిశోధనలపై చర్చ సమావేశం, మరియు పరస్పర ఒప్పందాలపై మొదటి సమావేశం నిర్వహించబడినది. ఎస్వీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ మాట్లాడుతూ ఎస్ వి వైద్య కళాశాల, ఎస్వీ విశ్వవిద్యాలయం పరస్పర ఒప్పందం వల్ల ఇటు విద్యార్థులకు, అధ్యాపకులకు, పరిశోధనలో మెలుకువలు తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనిఅని అన్నారు. అదేవిధంగా విశ్వవిద్యాలయంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి క్లినికల్ నాన్ క్లినికల్, వైద్యులు, ఎస్వీ వైద్య కళాశాల రుయా ఆసుపత్రి నుండి పంపినట్లయితే విశ్వవిద్యాలయం క్యాంపస్ చదువుకుంటున్న విద్యార్థులకు, సిబ్బందికి, మరియు కోటర్స్ లో నివసిస్తున్న కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ఇలాంటి ఒప్పందాలు ఎంతైనా అవసరమని వైస్ ఛాన్స్లర్ లో శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఎస్వీ విశ్వ విద్యాలయం తో మొట్టమొదటిసారిగా పరస్పర ఒప్పందం కొరకు ఈ సమావేశం నిర్వహించామని ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ తెలిపారు. ఇలాంటి పరస్పర ఒప్పందం వలన పరిశోధనలపై వైద్య విద్యార్థులకు, సోషల్ సైన్స్ విద్యార్థులకు, మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థులకు పరిశోధనలలో మెలకువలు , వాటికి కావలసిన ముఖ్య ఆవశ్యకతలను తెలుసుకొనుటకు పరస్పర ఒప్పందం ఎంతైనా అవసరమని అన్నారు. వివిధ విభాగలతో చర్చించి తదుపరి సమావేశంలో పరస్పర ఒప్పందం చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ నారాయణ బాబు, ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్, డాక్టర్ వెంకటేశ్వర్లు (పరిపాలన), డాక్టర్ సునీత (అకాడమిక్ ), డాక్టర్ సత్యనారాయణ మూర్తి ( పరిశోధనలు ), డాక్టర్ శశికళ,( సామాజిక వైద్య విభాగం ), ఎస్ వి విశ్వవిద్యాలయం చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, సీనియర్ టెక్నీషియన్ ముత్తువేలు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV