Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : స్థానిక శ్రీగోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో ఈరోజు తెలుగు,సంస్కృతం,ఇంగ్లీష్,హిందీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని ప్రిన్సిపాల్ డా. B.సత్యనారాయణ గారు తెలిపారు కళాశాలలోని తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ మరియు హిందీ విభాగాల అధ్యాపకులు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా తమ పిల్లలకు వ్యాసరచన పోటీలను వక్తృత్వక పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డా.B .సత్యనారాయణ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అంతర్జాతీయంగా మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు ఎందుకు జరుపుకోవలసి వచ్చింది అనే విషయాలను మరియు అమ్మ భాష, అమృత భాషయైన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని మాతృభాషను సంరక్షించుకోవలసిన అవసరాన్ని విద్యార్థులకు చక్కగా వివరించారు. అలాగే అన్ని భాషలకు మూలమైన సంస్కృత భాషను గుర్తుంచుకోవలసిన అవసరాన్ని,ఆధునిక తరంలో ప్రతి విద్యార్థికి అవసరమయ్యే ఇంగ్లీషు, హిందీ భాషల యొక్క ఆవశ్యకతను ఉద్దేశించి ప్రసంగించారు. విజేతలకు ప్రిన్సిపాల్ గారు బహుమతులను అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.D.విజయకుమార్ గారు మాట్లాడుతూ మాతృభాషా సంరక్షణను, అవసరాలకు అనుగుణంగా ఇతర భాషల యొక్క జ్ఞాన ప్రాధాన్యతను వివరించారు. IQAC కోఆర్డినేటర్ D.పరమేశ్వర విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తల్లి భాషను ప్రేమించాలని, అన్య భాషలను గౌరవించాలని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి డా.M.మాదన్న అధ్యాపకులు డా.J. కొండలరావు డా.P. శివకుమార్ సంస్కృత అధ్యాపకుడు డా.K .కోటేశ్వరయ్య ఇంగ్లీషు అధ్యాపకులు P.చంద్రయ్య హిందీ అధ్యాపకురాలు డా.M.మనీ గారు విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు కూడా తమ ముచ్చటైన ప్రసంగాలతో కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రధాన భూమికి పోషించిన వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అంకయ్య గారు విద్యార్థులనుద్దేశించి చక్కని ప్రసంగాన్ని అందించడమే గాక విద్యార్థులకు బహుమతులను, ప్రశంసాపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.
Admin
Famous TV