Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : గుండెపోటుతో హమాలీ వెంకటేశు మృతి చెందిన సంఘటన శనివారం చౌడేపల్లి లో చోటు చేసుకుంది కుటుంబ సభ్యుల కథనం మేరకు... పట్టణంలోని నేతాజీ నగర్ వెంకటేశు(56) హమాలీగా పని చేస్తున్నాడు ఈ క్రమంలో స్థానికంగా ఓ లారీ నుంచి ఎరువుల బస్తాలు దించిన తర్వాత హమాలీలంతా విశ్రాంతి తీసుకున్నారు పానీయం తాగిన వెంకటేశు వెంటనే కుప్పకూలిపోయాడు గుర్తించిన చుట్టుపక్కల హమాలీలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేరు స్టాఫ్ నర్స్ ప్రాథమిక చికిత్స అందించారు. ఇంతలోనే వెంకటేష్ మృతి చెందడం జరిగింది. గుండెపోటు వచ్చిన 30 నుంచి 40 నిమిషాల వ్యవధిలో సిపిఆర్ నిర్వహించినట్లయితే రోగి బతికే అవకాశం ఉందని వైద్య పరిజ్ఞానం తెలియజేస్తున్నది.చౌడేపల్లి ప్రాథమిక ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని ఎన్నిసార్లు వార్తాపత్రికల్లో వార్తాకథనాలు వచ్చినా స్పందించని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యుడు అందుబాటులో ఉండి ఉంటే ప్రాణం దక్కేదని స్థానికులు చర్చించుకోవడం విశేషం. పై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడం కూడా హాస్పిటల్ ఈ దుస్థితికి కారణమని స్థానికుల భావన. హమాలీల వాల్మీకి సంఘ నాయకుడుగా ఆయన మండలానికి సుపరిచితుడు అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్న వెంకటేష్ మృతి చెందడంతో పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Admin
Famous TV