Friday, 12 June 2026 01:50:36 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఘనంగా కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక ట్రస్ట్ 48వ వార్షికోత్సవ వేడుకలు

Date : 02 October 2023 05:35 PM Views : 552

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ప్రతిభ కలిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని సంకల్పించి, అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారు కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక ట్రస్ట్ ను స్థాపించి,అందులో ఎంతో మంది దాతలను భాగస్వాములను(విలీనం)చేసి ఉపకార వేతనాలను అందిస్తున్నారు. అందులో భాగంగా గత 48 సంవత్సరాలుగా ఈ సేవలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం పూతలపట్టు మండలంలోని పేటమిట్టలో ఉన్న మంగళ్ విద్యాలయంలో 48వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.గాంధీ జయంతిని పురస్కరించుకొని 150 మంది మెడిసిన్,ఇంజనీరింగ్, పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 40 లక్షల వరకు ఉపకార వేతనాలను అందజేశారు. ఈ సందర్భంగా అమరరాజా సంస్థల అధినేత డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ "గ్రామీణ విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయంగా ఈ ట్రస్ట్ ను స్థాపించామని, 1968లో 100రూపాయల పెట్టుబడితో ఈ ట్రస్టు స్థాపించగా నేడు 5 కోట్ల వరకు చేరిందన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో స్థిరపడి ఈ సంస్థకు చేయూతనిస్తే మరి కొంత మందికి సాయం చేయవచ్చునని సూచించారు. ఈ ట్రస్టుకు విరాళాలు అందజేస్తున్న దాతలకు తన కృతజ్ఞతలు తెలిపారు." ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన K.N.సత్యనారాయణ గారు ( Director IIT Tirupati) మాట్లాడుతూ "వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి, ఆదుకుంటున్న గల్లా కుటుంబాన్ని ముందుగా అభినందించారు. ఈ సంస్థకు విరాళాలు ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుతున్న వారందరినీ అభినందిస్తూ, విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు." ప్రవాసాంధ్ర భారతీయులు డాక్టర్ గౌరనేని రమాదేవి గారు మాట్లాడుతూ "విద్యార్థులందరూ విలువలతో కూడిన విద్యను అభ్యసించి దేశ పురోగతికి తోడ్పడాలన్నారు." అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల అలరించాయి. ఈకార్యక్రమంలో ఈ సంస్థ కార్యదర్శి గల్లా విజయ నాయుడు గారు, కార్యవర్గ సభ్యులైన మహదేవ నాయుడుగారు, సతీష్ గారు,బాలాజీ కిరణ్ గారు,గల్లా రాజశేఖర్ గారు,మంగళ విద్యాలయ ప్రిన్సిపల్ ధనంజయ నాయుడు గారు,స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డీన్ రవికుమార్ గారు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :