Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతికి కేటాయించిన తెలుగు అకాడమీ కేంద్ర కార్యాలయం తిరుపతి నుంచి పని చేస్తోందని ఎలాంటి అనుమానం వద్దని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.కార్యాలయం పని తీరు, నిర్వహణ తిరుపతి కేంద్రంగా జరపకపోవడం పట్ల అభ్యంతరం తెలిపింది రాయలసీమ మేధావుల ఫోరం. ఇదే సమయంలో పలు తెలుగు భాషా సాంస్కృతిక సంస్థలు ఈ మధ్యనే సమావేశం కావడం తిరుపతి కేంద్రంగా తెలుగు అకాడమీ పూర్తి స్థాయిలో పని చేయాలని తరలింపు అనుమానాలు నివృత్తి చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి.ఈ నేపథ్యంలో తిరుపతి పర్యటన కొచ్చిన అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి కార్యాలయ నిర్మాణం కోసం రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సాకం నాగరాజు తో కిలిసి తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్టల పరిశీలన చేశారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి RDO రామారావు ఏర్పేడు మండలంలోని రెండు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని లక్ష్మీ పార్వతికి చూపించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ వికేంద్రీకరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో అత్యంత కీలకమైన ప్రాధాన్యత అంశం. వికేంద్రీకరణ కోసం ఈ ప్రభుత్వం ఎంత శ్రద్ద తీసుకుంటుందో ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న తెలుగు అకాడమీని ఏపీ కి తీసుకురావడానికి కనీస ప్రయత్నం చేయలేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు అకాడమీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకురావడం కోసం మొదట హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లి సాధించిన విషయం గుర్తు చేశారు ఆర్థిక పరిమితులు, తెలంగాణ తో న్యాయ వ్యాజ్యం తర్వాత అకాడమీని గత రెండు సంవత్సరాలుగా నడుపుతున్నాము. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహణ జరుగుతుంది. స్థలం ఎంపిక చేసుకుని కార్యాలయం నిర్మానం కూడా చేస్తామని తెలిపారు. రాయలసీమ ప్రజలు అడగకుండానే తిరుపతి కి తెలుగు అకాడమీని కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంస్థ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారని వికేంద్రీకరణ విషయంలో రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అనుమానాల నివృత్తి చేసిన లక్ష్మీ పార్వతికి గారికి ధన్యవాదాలు కార్యాలయం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో బాటు కార్యాలయ పూర్తి స్థాయి కార్యకలాపాలు కూడా తిరుపతి కేంద్రంగా చేసుకుని నిర్వహణ జరిగేలా చూడాలని రాయలసీమ మేధావుల ఫోరం విజ్ఞప్తి చేస్తుంది
Admin
Famous TV