Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి,1983 - 84 సంవత్సరానికి చెందిన నెహ్రూ మున్సిపల్ హైస్కూలు పూర్వ విద్యార్థులు ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. కపిలతీర్థం బైపాస్ రోడ్ లోని ఓ ప్రైవేటు హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. స్నేహితులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సిపిఎం జిల్లా నేత కందారపు మురళి మున్సిపల్ ఆర్ ఓ కె. లోకేశ్వర వర్మ, అర్జున్ ఎలక్ట్రికల్స్ అధినేత అర్జున్, జయచంద్ర, సుబ్రహ్మణ్యం, సురేంద్ర, మన్నేపల్లి బాలకృష్ణ, డాక్టర్ రామ్ కుమార్, అశోక్, ప్రిన్సిపల్ రమేష్, ఆర్ఆర్ శ్రీనివాస్, గిరిధర్, సుబ్బారావు, కెబి శ్రీనివాస్, బివి రాయ్, గురుమూర్తి, కుప్పస్వామి, చంద్రమౌళి, శ్రీను, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV