Thursday, 30 July 2026 12:16:16 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

శ్రీకాళహస్తికి మరో తహసీల్దార్ కావలే..!

Date : 16 November 2023 01:26 PM Views : 589

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీకాళహస్తి మండలానికి మరో తహసీల్దార్ కావలే..! అని స్థానికులు కోరుతున్నారు. తహసీల్దార్ గా ధ్వారకానాథ్ రెడ్డి బాధ్యలు చేపట్టిన తర్వాత పత్రికల్లో,ప్రసార మాధ్యమాల్లో ఎన్నో భూ సమస్యలు ప్రచురితమైనా కనీసం స్పందించకపోగా కోర్టు కేసులు కోసం సమయం కేటాయిస్తూ వున్నారన్న విమర్శలు వెల్లువెత్తనున్నాయి.రాజీవ్ నగర్,గంగలపూడి,రాచ గున్నేరి తదితర గ్రామాల్లో ఎన్నో భూ కుంభకోణాలను పలు పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నా కార్యాలయానికే తహసీల్దార్ పరిమితమై ప్రభుత్వ భూములు.ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనే ఊకదంపుడు మాట చెప్పి భూ సమస్యలపై దృష్టి సారించలేకపోతూ వున్నారన్న విమర్శలను తహసీల్దార్ మూట గట్టుకుంటున్నారు.గత మూడు మాసాల్లో వచ్చిన ఏ భూ సమస్యపై తహసీల్దార్ కనీసం క్షేత్ర పరిశీలన చేసిన దాఖలాలు లెవంటే అతిసయోక్తి కాదేమో.కనీసం రెవెన్యూ సిబ్బంది కూడా భూసమస్యలను గాలికొదిలేసి హస్తలాగవం వచ్చే పనుల్లో బిజీగా వున్నారనే విమర్శలు వస్తున్నాయి.జటిలమైన భూసమస్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి భూ సమస్యలు పరిష్కరించాల్సిన తహసీల్దార్,రెవెన్యూ సిబ్బంది కనీసం కన్నెత్తి చూడకుండా వుండడం చూస్తే అసలు శ్రీకాళహస్తి రెవెన్యూ కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారి,సిబ్బంది పనిచేస్తున్నారా.. అనే అనుమానం వస్తుంది.ఎన్నో భూ సమస్యలు వెలుగులోకి వస్తుంటే రెవెన్యూ అధికారి ఎందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలించడం లేదో అవగతం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ తహసీల్దార్ కానీ,రెవెన్యూ సిబ్బంది కానీ క్షేత్రస్థాయిలో భూసమస్యలను పరిసకరించేందుకు చర్యలు తీసుకుంటే ఎక్కడ రాజకీయ నాయకులు నుంచి ఒత్తిళ్లు వస్తాయోమో..? లేదా బదిలీ వేటు పడుతూందేమోనని భయాందోళనలతో వున్నారా..? అనే సందేహం కలుగుతుంది.అందువల్ల రెవెన్యూ అధికారి,సిబ్బంది జటిలమైన భూ సమస్యపరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి ప్రజల్లో నమ్మకం పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది.మరి భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారి,సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: