Friday, 31 July 2026 02:24:15 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ముఖ్యమంత్రి గారి పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటు

బందోబస్తు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ

Date : 08 June 2023 07:30 PM Views : 706

Famous TV - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా : బందోబస్తు నిర్వహించే సమయంలో విధుల పట్ల పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ రేపు అనగా 09.06.2023 వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు గుడివాడ పట్టణంలో టిడ్కో గృహ సముదయాల ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసింతవరకు బందోబస్తు విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, పటిష్ట బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐపీఎస్ గారు బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులకు, సిబ్బందితో అన్నారు.ఈ రోజు జిల్లా ఎస్పీ గారు బందోబస్తు విధులలో పాల్గొనబోయే పోలీసు అధికారులు, సిబ్బందితో VKR VNB ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో గల ఆడిటోరింలో బ్రీఫింగ్ సమావేశాన్ని నిర్వహించి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు. విధులకు హాజరయ్యే క్రమంలో, తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని, వాహన రాకపోకల విషయంలో నిర్లక్ష్యం లేకుండా భద్రత నియమాలు పాటించాలని, ఏ చిన్న ప్రమాదం జరిగిన మనకే కాక మనపై ఆధారపడి ఉన్న కుటుంబం మొత్తం చిన్నాభిన్నమవుతుందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సిబ్బందితో తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్పీ గారు బందోబస్తును గూర్చి మాట్లాడుతూ బందోబస్తు విధులలో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బంది వారికి సెక్టార్ల వారీగా విధులను కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కరు కేటాయించిన స్థలానికి, నిర్దేశించిన సమయానికి విధులకు హాజరయ్యి ఉండాలని, హెలిప్యాడ్ నుండి సభావేదిక వరకు ఉన్న పాయింట్లో ఉండే అధికారులు మరియు సిబ్బంది కాన్యాయ్ వచ్చే సమయంలో ఎంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, కొంత దూరం రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తారు.విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సమయస్పూర్తితో వ్యవహరించాలని, ట్రాఫిక్ బందోబస్తులో ఉండే అధికారులు ట్రాఫిక్ నియంత్రణ మరియు సవ్యంగా జరిగేలా చూడాలి. విధుల్లో పాల్గొనే సిబ్బంది నీట్ యూనిఫామ్ ధరించి, విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ మీ విధులు ఉండాలి. సీఎం కాన్వాయ్ మార్గంలో ఏర్పాటుచేసిన బారిగెడ్ల వద్ద జాగ్రత్తగా వ్యవహరిస్తూ, సమూహాలను అదుపు చేస్తూ, మహిళలను అదుపు చేసే క్రమంలో మహిళా ఉద్యోగులు తప్పకుండా ఆ ప్రాంతంలో ఉండేలా చూడాలి. ముఖ్యమంత్రి గారిని చూడడానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలగకుండా నిబద్ధతగా ఉండాలి. విధుల్లో మంచి ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముఖ్యమంత్రి గారి పర్యటన పూర్తి చేయాలని తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: