Thursday, 11 June 2026 10:53:25 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

తుడా చైర్మెన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

పూర్తి స్థాయి రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిమగ్నం

Date : 19 August 2023 08:31 AM Views : 1471

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : * ** తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మెన్ గా చంద్రగిరి 2024 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కానున్నారు. *చంద్రగిరి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా..* ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 2024 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం గడప గడపకు పర్యటిస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీ టిడిపి నేతలు విమర్శలకు దిగారు. ఏ అధికారిక హోదాలో మోహిత్ రెడ్డి పర్యటిస్తున్నారని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎలా వెంట తిరుగుతున్నారని జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదులు చేశారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. 2024 ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలతో మమేకమవడం, ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందన్న క్రమంలో సీఎం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తుడా ఛైర్మెన్ బాధ్యతలు అప్పగించారు. ఇకపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో అధికారిక తుడా ఛైర్మెన్ హోదాలో పర్యటించనున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :