Thursday, 30 July 2026 10:47:35 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్నదాత సుఖీభవతో పెట్టుబడి సాయం

Date : 02 August 2025 06:21 PM Views : 570

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్నదాత సుఖీభవతో పెట్టుబడి సాయం చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా, చౌడేపల్లి కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు అండగా ఉంటూ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతిగా ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంచనంగా ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ తో ముఖ్యమంత్రి వీక్షిస్తూ ప్రధాని విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకానికి నాంది పలికిందని మండల వ్యవసాయ అధికారి మోహన్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని వారు రైతు సేవా కేంద్రం 4 లో వీడియో కాన్ఫరెన్స్ వీక్షిస్తూ వచ్చిన కూటమి నాయకులకు అన్నదాత సుఖీభవ పథక ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ పథక ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెదేపా మండలాధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయకొండ సుబ్బు, పూల చంద్రమౌళి మరియు కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధాని మోడీ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన వెంటనే అందరూ చప్పట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ కూటమి హయాంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరియు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎంతో నమ్మకంగా రుణపడి ఉండాలని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు నేడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే మరిన్ని సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మండలంలోని పెద్దకొండామర్రి, దిగువపల్లి, తదితర ప్రాంతాలలో కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆవుల పవన్,కుమార్ రెడ్డి, వెంకట్రమణ, మునివెంకటప్ప, శ్రీనివాసులు, బాల్ రెడ్డి, సుబాన్, చెంగల్రాయప్ప, అర్జున్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: