Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి, రేణిగుంట మండలం కరకంబాడి అమర రాజా విద్యాలయంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగినది , ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా అమర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరినేని రమాదేవి గారు హాజరయ్యారు. ముఖ్య అతిధి మాట్లాడుతూ "ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగాలని పాఠశాలకు పూర్వ విద్యార్థులు అనుబంధంగా ఉండాలని, మనమందరం సమాజానికి ఉపయోగపడే మంచి పనులను కలిసికట్టుగా చేయాలని తెలియజేశారు." పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 1995లో ప్రారంభమైన ఈ విద్యా సంవత్సరం 2023 వరకు అంచలంచెలుగా ఎంతో అభివృద్ధి చెందింది.ఇలాంటి పాఠశాలలో చదివినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని, విలువ లతో కూడిన విద్య ను నేర్చుకున్నామని ఈ రోజు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నామని, ఇలాంటి గొప్ప వేదికను కల్పించినందుకు చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు గారికిపూర్వ విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV