Friday, 12 June 2026 01:42:36 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అఖిలపక్షాల బేటీ

అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం

Date : 10 June 2023 04:55 PM Views : 659

Famous TV - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు : నరసరావుపేట సిపిఐ పార్టీ కార్యాలయంలో అగ్రి గోల్డ్ బాధితులు,ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అన్ని రాజకీయ పార్టీలతో కలిపి అఖిల పక్షబేటి 10.06.2023 ఉదయం 11 గంటల సమయంలో నిర్వహించారు.నరసరావుపేట సిపిఐ పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....9 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలబడి పోరాటం చేస్తున్న సిపిఐ నాయకులను అభినందించాలన్నారు.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ రెడ్డి అడ్డగించారని ,తెలుగుదేశం పార్టీలో నేతలు అగ్రిగోల్డ్ భూములు కొట్టేయాలని చూశారని తప్పుడు ప్రచారం చేశారు అని ఆరోపించారు.జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చాక చిల్లర విదిల్చి,అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను గాలికి వదిలేసారని ఆవేదన వ్యక్తం చేశారు.అగ్రిగోల్డ్ బాధితులకు సమస్యలు కోసం చంద్రబాబు నాయుడు అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతు మాదిరిగానే చలనం లేకుండా ఉందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో చిత్తశుద్ధితో అఖిలపక్షం ఏర్పాటు చేసి అగ్రిగోల్డ్ భాదితుల సమస్యలు విని పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని నవతరంపార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు.సామాన్య,మధ్యతరగతి కుటుంబాలు దాచుకున్న అగ్రిగోల్డ్ ప్రీమియం 3000 కోట్లు తిరిగి చెల్లించడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదని అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.93 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఇబ్బందులు పడుతుంటే జగన్ రెడ్డి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని జగన్ రెడ్డి,ఎమ్మెల్యేలు మాఫియాతో ప్రజాధనాన్ని దోచుకోవడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవ చేశారు.40వేల కోట్ల రూపాయల ఆస్తులు అగ్రిగోల్డ్ కు ఉంటే కేవలం7 వేల 500 కోట్ల రూపాయల అప్పు మాత్రమే అగ్రిగోల్డ్ కు ఉందని, ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ కోసం ముందుకు వస్తే సమస్య పరిష్కారం పెద్ద కష్టం కాబోదన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :