Famous TV - ఆంధ్రప్రదేశ్ / : చిత్తూరు, పూతలపట్టు మండలం, పేటమిట్ట , మంగళ్ విద్యాలయంలో తెలుగు రచయితలను ఘనంగా సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా అమర రాజ సంస్థల వ్యవస్తాపకులు డా. గల్లా రామచంద్ర నాయుడు గారు,మాజీ మంత్రివర్యులు గల్లా అరుణ కుమారి గారు,నామిని సుబ్రమణ్యం గారు,సాకం నాగరాజు గారు, పత్తిపాటి రమేష్ నాయుడు గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందిచడంలో తమదైన ముద్రను చాటుతున్న రచయితలను అభినందించి "వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం" అందుకున్న తరుణంలో నామిని సుబ్రమణ్యం గారిని ఘనంగా సన్మానించారు.విద్యార్థులందరూ విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. మాజీ మంత్రివర్యులు గల్లా అరుణ కుమారి గారు మాట్లాడుతూ, గల్లా రామచంద్ర నాయుడు గారి కలలు సహకారం అవుతున్నాయని, విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని చెప్పారు.ఆధునిక కాలంలో విలువలు పెంపొందించడంలో కవులు రచయితలు ముఖ్యపాత్రను పోషిస్తున్నారని, వారు రాసేటటువంటి పుస్తకాల ద్వారా కథల ద్వారా పిల్లలందరిలో నైతికాభివృద్ధి పెంపొందుతుందని, రచయితలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రచయితలైన నామిని సుబ్రమణ్యం గారు, శాకం నాగరాజు గారు, పత్తిపాటి రమేష్ నాయుడు గారు మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులలో పుస్తక పఠన నైపుణ్యాన్ని , వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందేలా చేయడమే ముఖ్యమని , తద్వారా ఎన్నో విలువలను అలవర్చుకుని వారి జీవితాన్ని సుగమం చేసుకుంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్. సతీష్ గారు, ప్రిన్సిపల్ ధనంజయ నాయుడుగారు , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV