Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, జూలై17: చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం, నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలబడాలన్న సదుద్ధేశంతో.. నేడు మంగళవారం ఉదయం వరుసగా నాలుగో ఏడాది మొదటి విడతగా (ఏడో విడత) జగనన్న తోడు వడ్డీ రీయింబర్స్‌మెంట్, ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీలేని రుణం కల్పిస్తూ , పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10వేలు అంతకు పైగా.. రాష్ట్రంలోని 5,10,412 మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 549.70 కోట్లు కొత్త రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కలిపి మొత్తం రూ. 560.73 కోట్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో గౌరవ సీఎం వైయస్. జగన్ జమ చేయగా తిరుపతి జిల్లాలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కోదండ రామిరెడ్డి, పిడి డిఆర్డిఎ, మెప్మా అధికారులు, మహిళా లబ్ధిదారు లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటారు సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, లేస్ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ ఈ జగనన్న తోడు పథకం ఒక వరం అని తెలిపారు. నేడు గౌరవ ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న తోడు వడ్డీ రీఇంబర్స్మెంట్ ని కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని, మన జిల్లాలో డి.ఆర్.డి.ఏ ద్వారా గ్రామీణ మరియు మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాల చిరు వ్యాపారులకు ఆరవ విడత జగనన్న తోడు నందు జిల్లాలో 17099 మందికి రూ.10 వేల చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు రూ.17.09 కోట్ల రుణాలు అందించడం జరుగుతోందని, గతంలో వారు తీసుకున్న రుణాలకు జిల్లాలో 23,201 మంది చిరు వ్యాపారులకు సుమారు రూ. 47.86 లక్షలు వడ్డీ రీఇంబర్స్మెంట్ లబ్ది (వడ్డీ రుణ మాఫీ) జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్. ముఖ్యమంత్రి తీసుకున్న చురుకైన చర్యల కారణంగా సకాలంలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి నిత్యం అందుబాటులో మూలధనం ఉంటోందని అన్నారు. సున్నా వడ్డీకే రుణాలు అందిస్తూ జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నారనీ అన్నారు. దేశంలోనే అత్యధికంగా వడ్డీలేని రుణాలు అందిస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం అని కొనియాడారు. ఇప్పటికీ అర్హత కలిగి లబ్ది చేకూరని వారు వుంటే సచివాలయం లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సిఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలిసి ఆరో విడత కింద రుణాలు మరియు ఏడో విడత వడ్డీ రీయింబర్స్మెంట్ నగదు కలిపి జిల్లాలో 40300 మందికి చెందిన సుమారు రూ. 17.57 కోట్ల మెగా చెక్కును జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పథక సంచాలకులు జ్యోతి, మెప్మ పిడి రాధమ్మ, మహిళా సంఘాల సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
Famous TV