Famous TV - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా : కృష్ణా జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఉప్పు.. నిప్పుగా ఉండే టీడీపీ, వైసీపీ నేతలు ఒకేచోట కనిపించారు. అంతేనా.. ఒకరిపై మరోకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అవును.. టీడీపీ ఎంపీ కేశినేని.. వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుపై పొగడ్తల వర్షం కురిపించారు. అటు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కూడా.. కేశినేని నానిని ఆకాశానికెత్తారు. వీరిద్దరి పొగడ్తల రాజకీయం ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావును టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసించారు. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. అభివృద్ధిలో ముందుంటారని వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా.. అభివృద్ధి కోసం కలిసి పని చేస్తాం అని ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) స్పష్టం చేశారు. చందర్లపాడు మండలం తోటరావులపాడులో.. వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన కేశినేని నాని.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Admin
Famous TV