Famous TV - ఆంధ్రప్రదేశ్ / : పర్యటన విజయవంతానికై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి జోగి రమేష్, కలెక్టర్ రాజాబాబు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం...* *-అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ రాజాబాబు....* *-కొడాలి నాని ఇలాకాలో నభూతో నభవిష్యత్ అన్న విధంగా సీఎం సభ జరుగుతుందన్న - జోగి రమేష్...* *-అశేష ప్రజానీకంతో సీఎం సభ నిర్వహిస్తామన్న - ఎమ్మెల్యే కొడాలి నాని...* గుడివాడ:కొడాలి నాని ఇలాక అయినా గుడివాడలో నభూతో నభవిష్యత్ అన్న విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన జరుగుతుందని, గుడివాడలో నిర్వహించే సీఎం సభ కోసం రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు.ఈనెల తొమ్మిదవ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుడివాడ పర్యటన ఖరారు కావడంతో, సీఎం చేతుల మీదుగా జరగనున్న టిడ్కో ఫ్లాట్ల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణపై పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి జోగి రమేష్, కలెక్టర్ రాజాబాబు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.సీఎం పర్యటన విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ రాజాబాబు, అధికార యంత్రాంగానికి పలు ఆదేశాలిచ్చారు. సీఎం సభలో పాల్గొనే ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు.30 వేల మందికి నీడనిచ్చే బృహత్తర కార్యక్రమం గుడివాడలో జరగడం సంతోషకరమని మంత్రి జోగు రమేష్ హర్షం వ్యక్తం చేశారు.లేవుట్ లో జరిగిన అభివృద్ధి పనులు, ఫ్లాట్ల నిర్మాణాలు చూస్తుంటే కన్నుల పండుగగా ఉందని ఆయన అన్నారు.పొరపాట్లు జరగకుండా అధికారులు బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. సమావేశంలో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ కోటేశ్వరరావు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల పాల్గొన్నారు.
Admin
Famous TV