Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుమల స్పెషల్ : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలనూ కుండపోత వానలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల ధాటికి తిరుమల ఘాట్ రోడ్డులో ఇవాళ ఉదయం కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని హరిణి దగ్గర విరిగిపడగా.. ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు సహాయచర్యలు చేపట్టారు. జేసీబీల సాయంతో బండరాళ్లను తొలగించారు. భారీ వర్షాల నేఫథ్యంలో కొండ చరియలు విరిగిపడే అవకాశముందని టీటీడీ ముందుగానే అంచనా వేసింది. ఆ క్రమంలోనే అన్ని విభాగాలను అప్రమత్తం చేసింది.
తిరుమల ఘాట్ రోడ్లలో సహాయచర్యల కోసం జేసీబీలు, ట్రక్కులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. అయితే వాహనాలు లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలోనే టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వర్షాలు తగ్గేవరకూ భక్తులు తిరుమల ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని టీటీడీ అధికారులు సూచించారు.
Admin
Famous TV