Thursday, 30 July 2026 06:24:43 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 29 June 2026 07:32 PM Views : 174

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : మదనపల్లి జూన్ 22: పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన సమస్యలను అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కలిగేలా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలు నందు... ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టరుతోపాటు జేసీ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్డిసి మాధవ కృష్ణారెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... పిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు.అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారులనుండి వారు అర్జీలను స్వీకరించారు.ప్రజల నుండి అందిన విజ్ఞప్తులలో కొన్ని..పుంగనూరు మండలం పూజిగానిపల్లికి చెందిన యద్దుల మంజుల.. కూలి పనికి పోతూ.. ఒంటరి మహిళగా జీవిస్తున్న తన రేషన్ కార్డులో పేరు తప్పుగా పడిందని, దాన్ని సరిచేసి రేషన్ కార్డుతో పాటు పింఛను మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.మదనపల్లి మండలం బసినికొండ పోస్టు, గంగన్నగారిపల్లి మజరా గ్రామానికి చెందిన టి. నిర్మల... తన పెద్ద కుమార్తె నిత్య ఎండోమెంట్ పక్షవాతంతో లేచి నడవలేని స్థితిలో మంచానికే పరిమిత పై ఉందని, ఆమెకు 90 శాతం సదరం సర్టిఫికెట్ ఇచ్చారని, మరలా పరిశీలించి వందశాతం సర్టిఫికెట్ జారీ చేసి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ సమర్పించారు.మదనపల్లి పట్టణం ఎన్విఆర్ వీధిలో నివసిస్తున్న ఎస్ షర్మిల..., రేషన్ కార్డులో తన పేరు తొలగించారని, విచారణ చేసి తిరిగి తన పేరును రేషన్ కార్డులో చేర్చాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 374 అర్జీలు రాగా వాటిపై తగు చర్య తీసుకొని పరిష్కరించు నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎండార్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :