Thursday, 11 June 2026 10:55:35 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

వెలుగులు విరజిమ్మనున్న వెంకటగిరి

ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి పట్టణానికి సెంట్రల్ లైటింగ్ తో మరింత శోభ

Date : 15 September 2023 06:10 PM Views : 1854

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : వెంకటగిరి పట్టణం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి-565 పై 2.450 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేసేందుకు నేషనల్ హైవే అథారిటీస్ టెండర్లు ఆహ్వానించింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక శ్రద్ద, కృషితో రూ.1,41 కోట్ల నిధులను వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో గల ఈ జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా కిమీ 480.690 నుండి కిమీ 483.140 వరకు "న్యూ మీడియన్ హైవే లైటింగ్" కోసం నిధులు మంజూరు చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీసర్ పనులు చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించారు. ఇదివరకే వెంకటగిరి పట్టణంలో ఎంపీ మద్దిల గురుమూర్తి తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు చేసి ఎల్ఈడి కాంతులు నింపిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ స్థానిక నియోజకవర్గ ఇంచార్జి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచన మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో వెంకటగిరి మునిసిపాలిటీలో ఈ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు పలు మార్లు కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించామన్నారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పట్టణ సుందరీకరణ తోపాటుగా రోడ్డు ప్రమాదాల నివారించవచ్చని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు. ప్రస్తుతం ఈ పనులు చేపట్టేందుకు సహకరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ గురుమూర్తి ధన్యవాదాలు తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :