Famous TV - ఆంధ్రప్రదేశ్ / : . నవంబర్ 20,21న విజయవాడలో 30 గంటల నిరసన దిక్షను జయప్రదం చేయండి. కాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గోడపత్రాల విడుదల పి మురళి సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణ జలాల పునః పంపిణీ పై రెండు తెలుగు రాష్ట్రాలకు ఏ పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ తక్షణం రద్దు చేయాలని, రాష్ట్రంలో కరువు పీడిత మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని నవంబర్ 20,21న విజయవాడలో జరుగు 30 గంటల నిరసన దీక్షలను జయప్రదం చేయాలని గురువారం ఉదయం 11 గంటలకి స్థానిక అంబేద్కర్ విగ్రవర్ వద్ద గోడపత్రాల విడుదలలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానది నీటి వివాదాలపై ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టుల వారీగా 811 టిఎంసిలు కేటాయించగా విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకుంటున్నాయన్నారు. మిగులు జలాలను వాడుకునే వెసులుబాటును బ్రిజేష్ కుమార్ కాల రాయడంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యము నడుస్తోందన్నారు. కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా, బ్రిజేష్ కుమార్ తీర్పు అమల్లోకి రాకుండానే కేంద్రంలో బిజెపి ఓట్ల కోసం రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను జఠలం చేసి లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. అందుకోసం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనుమతి లేని కేటాయింపులు లేని ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నందువల్ల ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం కృష్ణ నీటి వివాదాలపై మూడు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కాకముందే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంపిణీ చేసేందుకు తిరిగి బ్రిజేష్ కుమార్ ట్రిబనల్ కు కట్టబెట్టడం వెనుక ఆంధ్ర రాష్ట్రానికి అందులో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసే కుట్రలు దాగి ఉన్నాయన్నారు. కేంద్రంలో బిజెపి విభజన చట్టంలో పొందుపరిచిన హామీలకు తిలోదకాలు ఇచ్చి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఆయా రాష్ట్రాల తో సంప్రదింపులు చేయకుండానే అడ్డగోలుగా నిర్ణయాలు చేయడానికి తక్షణ ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదు కాక 448 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తుందన్నారు. సాధారణ సాగు విస్తీర్ణానికి నోచుకోక, అరాకొరగా వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సీమలు పట్టణాలకు వలస పోతున్నాయన్నారు. పశువులకు మేత లేక కబేలాలకు తరలిపోతున్నాయన్నారు. త్రాగునీటి ఎద్దడి ఆరంభమైందన్నారు. రాష్ట్రంలో ఎలినినో ప్రభావం వల్ల పూర్తిగా కరువు ఛాయలు అలుముకున్నాయన్నారు. కేవలం 103 కరువు ప్రభావం ఉన్నదని ప్రభుత్వము ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు. గతంలో వైసీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే వర్షాలు రావని, పూర్తిగా కరువు దాపురుస్తుందని చేసిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో కరువు ప్రభావం లేదని చెప్పడానికి కరువు మండలాలను ప్రకటించకుండా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఒక్క మండలం కూడా ప్రకటించకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నరు. ఇప్పటికైనా ప్రభుత్వం కరువు పీడిత మండలాలను అదనంగా చేర్చి ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం, పంట సాగు వేయని రైతులకు పెట్టుబడి సహాయం అందించాలన్నారు. ప్రత్యామ్నాయ స్వల్పకాలక పంటలకు విత్తనాలు ఎరువులు పురుగుమందులు, పశువుల దాన, పశుగ్రాస విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. వ్యవసాయ యంత్రాలు సూక్ష్మనీటి సేద్యపు పరికరాలపై ఇచ్చే రాయితీని పెంచి ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, పంట కాలువల నిర్మాణానికి, త్రాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. నిధులు నికరజరాల సాధనకై జరుగుతున్న 30 గంటల నిరసన దీక్షలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గbకార్యదర్శి జనమాల గురవయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు కే రాధాకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసిరాజు రూరల్ మండలం సెక్రటరీ M శివకుమార్ మోహన్ రెడ్డి వైయస్ మనీ కార్తీకు మురళి హరి గోవిందు అమ్ములు సురేష్ చందు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV