Friday, 12 June 2026 01:43:16 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం

ఎల్లవేళలా ఎంప్లాయిస్ యూనియన్ కి అండగా నిలుస్తా: అంజూరు తారక శ్రీనివాసులు

Date : 11 July 2023 02:53 PM Views : 459

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. కార్మికుల శ్రమ సంస్థలకు శ్రీరామరక్షని కార్మిక యూనియన్ ఎంప్లాయిస్ యూనియన్ కి అన్నివేళలా అండదండగా నిలుస్తామని ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఎంప్లాయిస్ యూనియన్ 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపట్టారు. ఈ కార్యక్రమం కు ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా విచ్చేసి యూనియన్ ఫ్లాగ్ ఆవిష్కరించారు. అనంతరం 72వ ఆవిర్భవ దినోత్సవ కేకును కట్ చేసి కార్మిక నాయకులకు పంచారు. ఎంప్లాయిస్ యూనియన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మికుల శ్రమతోనే ఏ సంస్థ అయినా మనుగడ సాగిస్తుందని, ఆర్టీసీ సంస్థ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కార్మికుల కష్టాలతోనే మనుగుడా సాగిస్తుందని గుర్తు చేశారు. ఎంప్లాయిస్ యూనియన్ ఎల్లవేళలా కార్మికుల కోసం పనిచేస్తుందని,ఎంప్లాయిస్ యూనియన్ కి తాము సంపూర్ణ అండదండలు అందించి ఎంతటి ఒత్తిళ్లు ఎదురైనా ఎంప్లాయిస్ యూనియన్ పక్షాన నిలుస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎన్ వి ఎస్ బాబు మృతికి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిపో కార్యదర్శి పసుపులేటి శ్రీనివాసకుమార్,నరసింహులు, సి వి బేబీమాధవ,రోశయ్య,జి,పి,ఎస్,ఆచారి,చంద్ర,గంగాధరం,రాజ్‌కుమార్, సెల్వ, ఉదయ,rss రెడ్డి, సుబ్బయ్య, మురళి, బాలాజీ, కటయ్య, వెంకటేశ్వరులు, మరియు మహిళా నాయకులు పట్టణ ప్రముఖులు పసల కుమారస్వామి, బాల్ శెట్టి నరసింహులు, సుందరష్, బాల గౌడ్, ప్రసాద్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :