Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : బుధవారము బెంగళూరు వాణీ విలాస్ హాస్పిటల్, వారి ఆధ్వర్యంలో నేషనల్ మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మరియు , అంతర్జాతీయ (ఇంటర్నేషనల్) మిడ్‌వైఫరీ ఎడ్యుకేటర్ మరియు మిడ్‌వైఫ్రీ ఇనిషియేటివ్స్ డైరెక్టర్ సారా కాక్సన్, మిస్టర్ భీమ్ రే సీనియర్, లీడ్ మిడ్‌వైఫరీ ప్రతినిధుల బృందం ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ను కలిసినారు. ఈ మిడ్ వైఫ్రీ ట్రైనింగ్ విషయాల గురించి, అందుకు కావలసిన శిక్షణను ప్రసూతి వైద్యశాల నందు, ఇవ్వడం గురించి చర్చించడం జరిగినది. అందుకు ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సానుకూలంగా స్పందిస్తూ తదుపరి కార్యాచరణ రూట్ మ్యాప్ తో తీసుకుని రావలసిందిగా అంతర్జాతీయ హెల్త్ ఎడ్యుకేటర్ తో మరియు వారి బృందంతో చర్చించడం జరిగినది. తదుపరి మిడ్ వైఫై ట్రైనింగ్ కావలసిన విషయాల గురించి క్లుప్తంగా వారికి తెలిపారు. తిరుపతిలో ని ప్రసూతి వైద్యశాల లో మిడ్‌వైఫ్రీ సేవలను బలోపేతం చేయవలసిందిగా కోరినారు. ఈ చర్చ యొక్క ప్రధాన లక్ష్యాలు స్త్రీల హక్కులను పరిరక్షించడం ద్వారా మిడ్ వైఫరీ లీడ్ కేర్ యూనిట్ (MLCU) లో ప్రసవాలను సులభతరం చేయవచ్చునని అన్నారు. బర్త్ కంపానియన్ నర్సు మిడ్‌వైఫరీ ప్రాక్టీషనర్‌తో పాటు గౌరవప్రదమైన ప్రసూతి సేవలను అందించడం. మిడ్‌వైఫ్రీ సేవలకు సంబంధించి స్థూల స్థాయి సున్నితత్వం గురించి ప్రిన్సిపాల్ వారికి క్లుప్తంగా వివరించారు, మరియు ప్రసూతి వైద్యశాల తిరుపతిలోని MLCUలో ప్రసవాలకు సంబంధించి తల్లులను ప్రోత్సహించి మిడ్‌వైఫ్రీ సేవలను పెంచడానికి, అపారమైన సహాయాన్ని అందించవచ్చునని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు డాక్టర్ సి హెచ్. మరియరోజమ్మ ప్రిన్సిపాల్ శ్రీ పద్మావతి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్( SPGCON,), నర్స్ ప్రాక్టీస్ మిడ్ వైఫై ( NPM) ప్రోగ్రామ్ సమన్వయకర్త, బిఎస్. హేమలత మిడ్ వైఫై ఎడ్యుకేటర్, ఎం. రమాదేవి మిడ్ వైఫై ఎడ్యుకేటర్ , కె.తనూజ మిడ్ వైఫరీ ఎడ్యుకేటర్, ఏం.జయలక్ష్మి మిడ్ వైఫై ఎడ్యుకేటర్ , జి.ర్. మన్న దీపిక మిడ్ వైఫై ఎడ్యుకేటర్, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ. వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV