Thursday, 11 June 2026 10:57:42 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే

Date : 14 March 2026 09:27 PM Views : 569

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : సమాచార హక్కు చట్టం పై కమీషనర్ కు పిర్యాదు పది సంవత్సరాల తర్వాత స్పందన చిత్తూరు ప్రభుత్వ కార్యాలయాలలో పారదర్శకత,జవాబుదారీ తనం ఉండాలని 2005 లో కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని రూపకల్పన చేసినది. ఐతే ప్రజలు తమ సమస్యల పైన సమాచార హక్కు కోసం ధరఖాస్తులు చేసుకోవటం వలన అధికారులు రాజకీయ నాయకుల మాటలు విని సదరు ధరఖాస్తును పక్కదోవ పట్టించే విధముగా ధరఖాస్తుదారుడిని బెధిరించడమో, లేదా అతన్ని ఇబ్బందులకు గురిచేయడమో, లేదా రాజకీయ నాయకులు మాటలు విని అతడి పైన తప్పుడు కేసులు పెట్టడమో, లేదా అతని పైన సమాజం చీదరించుకొనేలా అసత్య కథనాలు ప్రచారం చేయడం వంటి సంఘటనలు చేస్తున్నారు. ఈ మద్య కాలంలో కర్నూలు జిల్లా లో సమాచార హక్కు చట్టం ద్వారా ధరఖాస్తు చేశాడని అతని భార్య పైన తప్పుడు కేసులు బనాయించారు. ఆవిడ తీవ్ర అనారోగ్యానికి గురైనది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ మద్య డిఆర్ డిఎ అధికారులకు సమాచారం పెడితే సరైన సమాచారం ఇవ్వక తప్పుడు కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేశారు. స్థానిక గుండాల చేత సదరు ధరఖాస్తు దారుడి పై దాడులు చేయించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎప్పుడో 22 అక్టోబర్ 2016 వ సంవత్సరం లో పలమనేరు కు చెదిన మునిరత్నం అనే వ్యక్తి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం పెడితే సమాచారం పై స్పందన లేదని కమీషనర్ కు పిర్యాదు చేస్తే 9 మార్చి 2026 కమీషనర్ స్థాయి అధికారులు స్పందించి ధరఖాస్తు పత్రాలు, నకళ్ళు తీసుకొని, కమీషనర్ ముందు హాజరు కావాలని ధరఖాస్తు దారుడికి సమన్స్ పంపారు. అంటే మన ప్రభుత్వ అధికారులు విధులు ఎలా నిర్వహిస్తున్నారో ఇట్లే అర్థమౌతుంది. అప్పీల్ నెంబర్ 4304/2017 ను ఇప్పుడు హియరింగ్ కు రావాలని సమన్స్ పంపారు.అంటే సమాచార స్థాయి కమీషన్ ఎంతటి నిబద్దతతో పనిచేస్తుందో ఆలోచించండి.తప్పు ఎవరిధి? ఇదేనా జవాబుదారీతనం అంటే ఇదేనా పారదర్శకత అంటే? ఇదేనా ప్రజల కు ప్రభుత్వాలు ఇచ్చే సందేశం, ఇదేనా సామాన్యూడికి జరిగే న్యాయం. పది సంవత్సరాల తర్వాత సమాచార కమీషన్ నుండి సమన్స్ రావడం సమాచార కమీషన్ ఎంతటి నిర్లక్ష్యం గా ఉందో ప్రజలకు అర్థమౌతుందని ధరఖాస్తుదారుడు అన్నాడు. కావున వెటనే పది సఃవత్సరాల కాలానికి ధరఖాస్తుదారుడికి నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :