Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శ్రీ కె మధుసూదన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రైల్వే భద్రత దళం తిరుపతి వారు రాష్ట్రీయ సేవా సమితి వారి సహకారంతో రాష్ట్రీయ సేవా సమితి ఆఫీసు నందు మహిళా భద్రతపై అవగాహన సదస్సును గురువారం నాడు ఏర్పాటు చేశారు. శ్రీ నాగేశ్వరరావు, రాష్ట్రీయ సేవా సమితి కోఆర్డినేటర్, శ్రీమతి సుజాత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సఖి (ఒన్ స్టాప్ సెంటర్)చిత్తూరు, రైల్వే భద్రత దళం అధికారులు మరియు సిబ్బంది హాజరయ్యారు. రాష్ట్రీయ సేవా సమితికి సంబంధించిన స్వయం సహాయక బృందం , ఒకేషనల్ కోర్సు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ కె మధుసూదన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహిళా భద్రత గురించి తెలుపుతూ రైల్వే స్టేషన్లో మరియు పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలు మరియు ఇంటి నుండి తప్పిపోయిన పిల్లలను చూస్తూ ఉంటామని అంతేకాకుండా రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం చూస్తూ ఉన్నామని తెలియజేశారు. ఇటువంటి ఎన్నో సంఘటనలను దృష్టిలో ఉంచుకొని రైల్వే భద్రత దళం వారు అనేక కార్యక్రమాలను చేపట్టారని అందులో మహిళ సురక్ష ( మేరీ సహెలి), మాతృ శక్తి, నహ్నె ఫరిస్తే ఎంతో ప్రాముఖ్యమని తెలిపారు. ఆర్ పి ఎఫ్ వారు ఒంటరిగా ప్రయాణించే మహిళలకు చేయూతగా వారి యొక్క వివరాలను తీసుకొని వారికి యొక్క భద్రతకు కొరకు పలు రైల్వే స్టేషన్ నందు ఆర్పీఎఫ్ సిబ్బంది వారి వద్ద హాజరవ్వడం జరుగుతున్నది అని తెలియజేశారు. అంతేకాకుండా మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ఆర్పిఎఫ్ ఎంతో కృషి చేస్తుందని తెలియజేశారు. రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా స్త్రీలకు వారి ప్రయాణంలో ఏ విధమైన అంతరాయం కలిగిన తక్షణమే రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139 కు సంప్రదించవలసిందిగా కోరారు. రైళ్లలో ఎవరైనా ఆకతాయిలు మహిళలపై లేక సాటి ప్రయాణికులపై దుశ్చర్యలకు పాల్పడితే రైల్వే చట్ట ప్రకారం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తప్పిపోయిన పిల్లలను కాపాడేందుకు చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 సంబంధించిన వివరాలు తెలియజేశారు. తదుపరి శ్రీమతి సుజాత, అడ్మినిస్ట్రేటర్,సఖి మాట్లాడుతూ నేటి సమాజంలో ఎంతో మంది మహిళలు ఎన్నో రకాలుగా బాధింపబడుతున్నారని అటువంటి మహిళలకు వారి సంస్కృతి ద్వారా అనేక సదుపాయాలు కల్పించబడుతున్నాయి కల్పించబడతాయని తెలియజేశారు. ముఖ్యంగా నివాస, వైద్య, న్యాయ సంబంధిత సహాయాన్ని అందజేస్తారని తెలియజేశారు. అంతేకాకుండా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని, టోల్ ఫ్రీ నెంబర్ 181 గురించి తెలిపారు. శ్రీమతి శైలజ, ఉమెన్ కానిస్టేబుల్, రైల్వే భద్రత దళం చేపట్టిన మహిళ యొక్క భద్రతకు సంబంధించిన కార్యక్రమాల గురించి తెలియజేస్తూ, తమ విధులను ఏ విధంగా నిర్వహిస్తున్నారు వివరించారు మహిళలగా తమ వృత్తిలో సాటి మహిళకు సహాయం చేయడం చాలా సంతృప్తికరంగా ఉందని తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ నాగరాజు, ప్రాజెక్ట్ డైరెక్టర్, రాష్ట్రీయ సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
Admin
Famous TV