Thursday, 11 June 2026 10:55:35 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఓజోన్ ని కాపాడుకుందాం భూమిని రక్షించుకుందాం

Date : 16 September 2023 05:59 PM Views : 1471

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్.మల్లవరం నందు ప్రధానోపాధ్యాయులు డాక్టర్ కె.వెంకటరమణ అధ్యక్షతన ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు..ఈసందర్భం ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతూ ఓజోన్ పొరను ని మనం రక్షిస్తే అది భూమిమీద నివసించే జీవరాశులను రక్షిస్తుందని కనుక భావి భారత పౌరులైన మీరందరూ ప్రతిన బూని ఓజోన్ ని రక్షించాలని పిలుపునిచ్చారు.వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య మాట్లాడుతూ మన భూమి నుంచి 19 మైళ్ళ ఎత్తులో ఓజోన్‌ పొర ఉందని,ఇది భూమిపై నివసించే మానవాళి, ఇతర జీవరాశుల మనుగడకు ఎంతో కీలకమని ఓజోన్‌ అంటే.. 3 ఆక్సిజన్‌ పరమాణువులు కలిస్తే ఏర్పడే మూలకమని సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుందని ఒకవేళ ఓజోన్‌ పొర అడ్డుగా లేకపోతే.. సూర్యుడి కిరణాలు నేరుగా మనుషుల మీద పడి చర్మ క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులను కలిగిస్తాయని,కాలుష్య ఉద్గారాలు, ఏసీ వాడకం వల్ల వెలువడే ఉద్గారాల కారణంగా ఓజోన్‌ పొర దెబ్బతింటోందని ఇప్పటికే ఓజోన్‌ పొర క్షీణిస్తోందని పర్యావరణ శాస్త్రవేత్తలు 1982లో గుర్తించారని ఇలాంటి పరిస్థితులే కొనసాగిస్తే భవిష్యత్తులో జీవకోటికి పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని గమనించిన ఐక్యరాజ్యసమితి, ఓజోన్‌ సంరక్షణ కోసం ప్రపంచ దేశాలను ఏకం చేసింది. తొలిసారిగా 1987లో 24 దేశాల ప్రతినిధులు కెనడాలోని మాంట్రియల్‌లో ఓజోన్ పొర క్షీణిస్తున్న భయంకరమైన పరిస్థితిపై చర్చించేందుకు సమావేశమయ్యారని ఓజోన్‌ పొర క్షీణతను అరికట్టాలని తీర్మానించాయని అప్పటి నుంచే.. ప్రతి సంవత్సరం అదే రోజున అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నాము కనుక మీరందరూ భాధ్యత గా మెలగాలని ఆకాంక్షించారు..కార్యక్రమం లో వ్యాస రచన, వకృత్వం,చిత్రలేఖనం,క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు వే ఫౌండేషన్ వారు బహుమతులు,ప్రశంసా పత్రాలు అందించారు..కార్యక్రమం లో ఉపాధ్యాయులు చిట్టిబాబు,బ్రహ్మానందరెడ్డి,రవి,పరందామ రెడ్డి, దేవరాజులు,చూడామణి తదితర ఉపాధ్యాయులు,వే ఫౌండేషన్ ప్రతినిధులు వినోద్,చంద్ర శేఖర్,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :