Thursday, 11 June 2026 10:55:46 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు

-ఎస్వీయూలో అలరించిన కోలాట ప్రదర్శన

Date : 17 March 2026 07:18 AM Views : 556

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : - *తెలుగు విభాగంలో ఆకట్టుకున్న కవి సమ్మేళనం* - - *పద్య పఠనం, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం* శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖ - ఈతరం కవితా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోలాట ప్రదర్శనను ఎస్ వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధారాణి, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి, ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ జిఎం సుందరవల్లి ప్రారంభించారు. ఎంఏ తెలుగు పూర్వ విద్యార్థి వెంకటేష్ నేతృత్వంలో కోలాట ప్రదర్శన అద్వితీయంగా నిర్వహించారు. భక్తి గీతాలతో కోలాట దర్శన అందర్నీ అలరించింది. కోలాట ప్రదర్శనలో డప్పు పై చక్రవర్తి, తబలాపై వెంకటరమణారెడ్డి వాద్య సహకారం అందించారు. అందరికీ ఉగాది పచ్చడి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తెలుగు విభాగంలోని ఆచార్య జియన్ రెడ్డి సెమినార్ హాల్లో ఉగాది వేడుకలు చేపట్టారు. ఇటీవల కన్నుమూసిన ఎస్వీయూ తెలుగు విశ్రాంతాచార్యులు జక్కంపూడి మునిరత్నం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. తెలుగు విభాగంలో పరిశోధకులుగా, అధ్యాపకులుగా ఆచార్య జక్కంపూడి మునిరత్నం ఎంతో కృషి చేశారని తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ రాజేశ్వరమ్మ కొనియాడారు. ఈతరం కవితా వేదిక గౌరవాధ్యక్షులు, ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్జీడి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రకృతికీ మనిషికీ గల అనుబంధాన్ని గుర్తుచేసేది ఉగాది పండుగ అని తెలిపారు. ప్రతి ఉగాదికి కవి సమ్మేళనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఈతరం కవితా వేదిక అధ్యక్షులు తోట వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ తరం యువత మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఉగాది పండుగ వసంత రుతువునూ, కోయిల పాటలను తెస్తుందన్నారు. దూబగుంట రామకృష్ణ, ఆకుల మల్లేశ్వరరావు, రెడ్డిపల్లి షాజహాన్, రవితో పాటు సుమారు 20 మంది కవులు కవితా పఠనం చేశారు. ఇందులో కె. శృతి, విద్య, బాలకృష్ణ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పొందారు. ఈ కవి సమ్మేళనానికి న్యాయ నిర్ణీతలుగా ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. విజేతలకు సర్టిఫికెట్లు, పుస్తక బహుమతులను అందజేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా చేపట్టిన పద్య పఠనం, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పుస్తక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్లు కోసూరు దామోదర్ నాయుడు, కె. మునిరత్నం, కాటూరి శారద, హెచ్ఎస్ సౌభాగ్యమ్మ, గెస్ట్ ఫ్యాకల్టీ సునీల్ కుమార్, అశోక్, ఆదిశేషయ్య, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :